Y S Konda Reddy: పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ బంధువుల్లో ఒకరైన కొండారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. రోడ్డు పనుల విషయంలో ఓ కాంట్రాక్టర్ ను బెరించినందుకే అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయనపై ఎస్ఆర్ కే కంపెనీ కన్ స్ర్టక్షన్స్ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందుకే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

పులివెందుల వైఎస్ నాయకుల కంచుకోట. అక్కడ ఓ వైసీపీ నేతను అరెస్టు చేశారంటే అందులో ఎవరి హస్తం ఉందనే వాదనలు వస్తున్నాయి. అక్కడ ఏ పనిచేయాలన్నా వారే. ఎంత పర్సంటేజీ ఇవ్వాలని తేల్చాలన్నా వారిదే పెత్తనం. దీంతో ఎవరైనా ఏ పని చేయాలన్నా వైఎస్ కుటుంబీకుల కనుసన్నల్లోనే అన్ని నడుస్తాయి. అలాంటి చోట వైసీపీ నేత అరెస్టు గందరగోళానికి దారి తీస్తోంది. అసలు విషయం ఏమై ఉంటుందనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: M S Raju: అరెరే.. బూతులో మునిగితేలుతున్న రాజు గారు !
తమ మండలంలో తనకు తెలియకుండా పనులు చేయడంపై కొండారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనులు అడ్డుకోవడంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మొత్తానికి జగన్ సొంత నియోకవర్గంలో అదీ తన సొంత వారిని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది.

అయితే కొండారెడ్డి అరెస్ట్ తో ఆయన సేవలను వద్దనుకుంటున్నారా? వైసీపీ నుంచి బహిష్కరించే నిమిత్తమే అరెస్టుకు నాంది పలికారా? అన్న వాదనలు వస్తున్నాయి. ఈ పరిణామాలతో పార్టీలో చర్చ సాగుతోంది. కొండారెడ్డిని కావాలనే దూరం చేస్తున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి. జగన్ ఏది అనుకుంటే అది చేయడమే ఆయనకు అలవాటు. ఇప్పుడు సొంత పార్టీ వారినే అరెస్టు చేయిస్తూ ఏం సాధిస్తారో తెలియడం లేదు.
Also Read: F3 As Same As F2: ప్చ్.. ‘ఎఫ్ 3’లోనూ ‘ఎఫ్ 2’ వాసనలే !
Recommended Videos:



[…] Also Read: Y S Konda Reddy: పులివెందులలో వైఎస్ కొండారెడ్డ… […]