AP Mlc Election : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్.. ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి విజయం

AP mlc election : అనుకున్నట్టే అయ్యింది. చంద్రబాబు లాబీయింగ్ పనిచేసింది. 151 మంది ఎమ్మెల్యేలతో నాకు తిరుగులేదు అని గొప్పలకు పోయిన జగన్ కు శృంగభంగమైంది. వైసీపీకి ఆ పార్టీ రెబెల్స్ నే షాకిచ్చారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. ఈ గెలుపుతో వచ్చేది వైసీపీ ప్రభుత్వం కాదని..ప్రజల్లో, సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనూ వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని తేటతెల్లమైంది. ఇది జగన్ దిగిపోవడానికి సూచిక అని.. టీడీపీకి ఒక కొత్త ఊపిరి […]

Written By: NARESH, Updated On : March 23, 2023 7:28 pm
Follow us on

AP mlc election : అనుకున్నట్టే అయ్యింది. చంద్రబాబు లాబీయింగ్ పనిచేసింది. 151 మంది ఎమ్మెల్యేలతో నాకు తిరుగులేదు అని గొప్పలకు పోయిన జగన్ కు శృంగభంగమైంది. వైసీపీకి ఆ పార్టీ రెబెల్స్ నే షాకిచ్చారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. ఈ గెలుపుతో వచ్చేది వైసీపీ ప్రభుత్వం కాదని..ప్రజల్లో, సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనూ వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని తేటతెల్లమైంది. ఇది జగన్ దిగిపోవడానికి సూచిక అని.. టీడీపీకి ఒక కొత్త ఊపిరి వచ్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుందని సమాచారం. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియడంతో 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారని తెలిసింది. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ చేసినట్టు తెలిసింది.

వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టీడీపీకి పడ్డాయనే విషయంలో ఎలాంటి సందేశం లేదు. టీడీపీకి ఓటు వేసిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఊహించని విధంగా అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వచ్చేసారి అధికారం కోసం ఆశపడుతున్న టీడీపీకి ఎమ్మెల్సీ ఫలితాలు కొత్త ఊపిరి ఇచ్చినట్టైందని ఆ పార్టీ శ్రేణులు సంతోషపడుతున్నాయి.