ఆంధ్రప్రదేశ్‌TDP Boycott Assembly: అసెంబ్లీని బహిష్కరించిన టిడిపి.. స్పీకర్ తీరుపై శివాలెత్తిన అచ్చెనాయుడు

TDP Boycott Assembly: అసెంబ్లీని బహిష్కరించిన టిడిపి.. స్పీకర్ తీరుపై శివాలెత్తిన అచ్చెనాయుడు

TDP Boycott Assembly: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు టిడిపి పట్టు పట్టింది. గత రెండు రోజులుగా డిమాండ్ చేస్తూనే ఉంది. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం నుంచి సానుకూలత రాలేదు. నిన్న అసెంబ్లీ ప్రారంభం నుంచి టిడిపి నిరసన చేపడుతూ వచ్చింది. టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టూ బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒకరోజు పాటు సస్పెన్షన్ విధించారు.

రెండో రోజు సభ ప్రారంభంలో సైతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదే నిరసనను కొనసాగించారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం కొందరిని ఐదు రోజులపాటు, మరికొందరిని ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించినట్లు ప్రకటించింది. శాసనసభా పక్ష ఉప నేత, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు ప్రకటించారు. స్పీకర్ తీరును తప్పు పట్టారు. తమ్మినేని సీతారాం తనను యూస్ లెస్ ఫెలో అని సంబోధించారని అచ్చన్న ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ తాజా కామెంట్స్ శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచాయి. జిల్లాలో ఎవరు యూస్ లెస్ ఫెలో లో అందరికీ తెలుసునని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. టిడిపిలో ఎదిగి.. కీలక పదవులు తెచ్చుకున్న తమ్మినేని.. ఊసరవెల్లి రాజకీయాలు నడుపుతున్నారని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కింజరాపు కుటుంబానికి, నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. అందుకే 2004 నుంచి 2019 వరకు ప్రజలు అధికారానికి దూరం చేశారని నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రభంజనంతోనే గెలిచిన విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని ఓటమి ఖాయమని.. అటువంటి నేత యూస్ లెస్ ఫెలో అని అచ్చెనాయుడు గురించి మాట్లాడడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ గా తమ్మినేని శాసనసభను నడిపించడంలో విఫలం అయ్యారని.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయాల కోసం ఆపసోపాలు పడుతున్న తమ్మినేని కి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

YCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలను దెబ్బకొట్టే అవకాశం తృటిలో మిస్

YCP MLAs: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా అసెంబ్లీకి దూరంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్ననే సభకు వచ్చింది. సరిగ్గా 11 నిమిషాల పాటు...

AP Assembly Sessions 2026: ఈ ఫిబ్రవరిలో మోత మోగనుంది

AP Assembly Sessions 2026: ఏపీ( Andhra Pradesh) అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే సభకు హాజరుకామని వైయస్సార్ కాంగ్రెస్...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version