https://oktelugu.com/

Indian Cricket Team: రోహిత్, కోహ్లీ లా తర్వాత ఇండియన్ టీం ని శాశించే ప్లేయర్లు వీళ్లే…

ఈ లిస్ట్ లో మొదటి వరుసలో ఉండే ప్లేయర్ శుభమన్ గిల్... ఈయన ఆడిన ప్రతి ఫార్మాట్ లో సెంచరీ చేసి ఇప్పటికే తన టాలెంట్ ఏంటి అనేది అందరికి చూపిస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : September 22, 2023 / 05:57 PM IST

    Indian Cricket Team

    Follow us on

    Indian Cricket Team: ఇండియన్ క్రికెట్ టీం లో ఆటగాళ్ల మధ్య పోటీ రోజురోజుకి పెరిగిపోతుంది.ఒక ప్లేయర్ బాగా ఆడుతున్నాడు అనుకునే లోపే ఇంకో ప్లేయర్ ఆ ప్లేయర్ ని బీట్ చేసేలా ఆడుతున్నాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ కి బిసిసిఐ టీమ్ ని సెలక్ట్ చేసింది, కానీ ఫ్యూచర్ లో ఇండియన్ టీమ్ ప్లేయర్లను సెలెక్ట్ చేయడం కష్టమే అవుతుంది….నిజానికి వీళ్ళందరూ ఇలా ఆడటం కూడా ఇండియా టీం కి చాలా రకాలు గా ప్లస్ అవుతుంది. కానీ వీళ్ళలో ఎవరిని ఫైనల్ టీం లోకి సెలెక్ట్ చేయాలి, ఒక వేళ చేసిన ప్లేయింగ్ లెవన్ లోకి ఎవరిని తీసుకోవాలి అనే దానిమీద బిసిసిఐ చాలా వరకు ఆలోచనలు చేస్తుంది.ప్రస్తుతం ఒక్క ప్లేస్ లో ఆడటానికి ముగ్గురు ప్లేయర్ల వరకు ఉన్నారు. ఇక ఓపెనర్లు గా ఆడటానికి అయితే దాదాపు ఆరుగురు ప్లేయర్లు ఉన్నారు… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీనియర్ ప్లేయర్లకి పోటీ ఇస్తూ జూనియర్ ప్లేయర్లు దూసుకువస్తున్నారు…

    ఒక సిరీస్ లో బాగా ఆడకపోతే ఇక ఆ ప్లేయర్ల పరిస్థితి అంతే అనే చెప్పాలి. వాళ్లని మిగితా మ్యాచుల్లో తీసుకోవడం డౌట్ అనే చెప్పాలి.ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్లేయర్ల మధ్య పోటీ అనేది విపరీతంగా ఉంది. కాబట్టి ఒక ప్లేయర్ బాగా ఆడకపోతే ఆయన ప్లేస్ లోకి ఇంకో ప్లేయర్ ని ట్రై చేస్తున్నారు…ప్రస్తుతం ఇండియన్ టీం లో చాలా మంది యంగ్ ప్లేయర్లు ఉన్నారు…ఇంకో 5 సంవత్సరాలలో ఇండియన్ క్రికెట్ టీం లో అద్భుతాలు చేయగలిగే ప్లేయర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

    ఈ లిస్ట్ లో మొదటి వరుసలో ఉండే ప్లేయర్ శుభమన్ గిల్… ఈయన ఆడిన ప్రతి ఫార్మాట్ లో సెంచరీ చేసి ఇప్పటికే తన టాలెంట్ ఏంటి అనేది అందరికి చూపిస్తున్నాడు.నిజానికి ఈయన 2023 వ సంవత్సరం లో టెస్ట్, వన్డే, టి 20 , ఐపీల్ లో సెంచరీలు సాధించాడు.అందుకే గిల్ ఇండియాలోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే నెంబర్ వన్ బ్యాట్సమెన్ గా పేరు పొందుతాడు అనేది మాత్రం వాస్తవం…ఇప్పటికే ఇండియన్ క్రికెట్ లో మంచి ఓపెనర్ ప్లేయర్ గా పేరు సంపాదించుకున్నాడు ఇక ఈయన ముందు ముందు ఇండియన్ టీం కెప్టెన్ గా బాధ్యతలు కూడా తీసుకునే అవకాశం ఉంది…అలాగే సచిన్ టెండూల్కర్,విరాట్ కోహ్లీ నెలకొల్పిన రికార్డులు కూడా బ్రేక్ చేయగల సత్తా గిల్ దగ్గర ఉంది అనేది ఆయన బ్యాటింగ్ ని చూస్తేనే మనం చెప్పవచ్చు…

    ఇక ఈ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ మన తెలుగు తేజం అయినా తిలక్ వర్మ…ఈయన బ్యాటింగ్ చూసిన చాలా మంది సీనియర్ ఆటగాళ్లు సైతం ఆశ్చర్య పడుతున్నారు.ఎందుకంటే ఒక జూనియర్ ప్లేయర్ అయినా కూడా సినియర్ ప్లేయర్ ఏ విధం గా ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తూ మ్యాచ్ లు ఆడుతాడో అచ్చం అలాగే తిలక్ వర్మ కూడా ఆడుతున్నాడు. అంటూ చాలా మంది సీనియర్ ప్లేయర్లు ఆయన మీద ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు…నిజానికి తిలక్ వర్మ మంచి ప్లేయర్ ఆయన కచ్చితంగా ఇండియన్ టీం లో మరో కోహ్లీ అవుతాడు అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అనే చెప్పాలి…

    ఇక ఈ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ ఋతురాజ్ గైక్వాడ్…గైక్వాడ్ ఒక మంచి ఓపెనర్ ప్లేయర్ మ్యాచ్ పొజిషన్ ని బట్టి మనం ఎలా ఆడితే మన టీం కి మనం యూజ్ అవుతాం అని ఆలోచిస్తూ ఉంటాడు.అందుకే ఆయన ఓపెనర్ గా చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తాడు అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు.నిజానికి ఈయన పేస్ బౌలర్లని చాలా ఈజీగా ఆడుతాడు…ఇప్పటికే ఐపీల్ లో తన ఆట తీరుని అందరు బాగా చూసారు అవకాశం వస్తే ఇండియన్ టీమ్ లో కూడా సూపర్ గా ఆడుతాడు. ఇక ఇప్పుడు ఏషియన్ గేమ్స్ లోకూడా కెప్టెన్ గా తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు…

    ఇక వీళ్ల తర్వాత చెప్పుకునే మరో ప్లేయర్ యశస్వి జైశ్వాల్…ఈయన ఆడిన ప్రతి మ్యాచ్ కూడా తన స్థాయి మేరకు టీం ని గెలిపించే ప్రయత్నం అయితే చేస్తాడు.ఇక రీసెంట్ గా టెస్ట్ లో డెబ్యూ చేసిన ఈయన ఆడిన మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లోనే సెంచరీ చేసాడు. ఇక ఇప్పుడు వన్డే, టి 20 ల్లో కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడటానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఆయన ఐపీల్ లో రాజస్థాన్ రాయల్స్ టీం లో మంచి పెర్ఫామెన్స్ ఇస్తూ ఆ టీమ్ లో కీలక ప్లేయర్ గా మారిపోయాడు…ఇతను కూడా ఫ్యూచర్ లో ఇండియన్ టీం తరుపున చాలా రికార్డు లు బ్రేక్ చేస్తాడు అని చెప్పవచ్చు…

    ఇక ఈ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ జితేష్ శర్మ… ఈయన కూడా ఇండియన్ టీం కి ఒక హిట్టర్ గా, ఒక వికెట్ కీపర్ గా తన సేవలు అందించడానికి రెడీ గా ఉన్నాడు. నాకు తెలిసి ధోని లేని లోటు ని అటు కీపింగ్ లోను,ఇటు బ్యాటింగ్ లోను హిట్టింగ్ చేస్తూ ఒక సూపర్ ఇన్నింగ్స్ అయితే ఆడగలడు.అందుకే ఈయన కూడా ఇండియన్ టీం కి ఫ్యూచర్ లో ఒక కీలకమైన ప్లేయర్ గా మారనున్నాడు అనేది వాస్తవం…

    ఇక తర్వాత చెప్పుకోబోయే ప్లేయర్ రింకు సింగ్…ఈయన ఆడిన ఆట తీరుని మనం ఇంతకుముందు ఐపీల్ లో చూసాం… బాల్ ని సిక్స్ కొట్టాలి అని ఆయన స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే అవతల బౌలర్ ఎలాంటి బాల్ వేసిన దాన్ని సిక్స్ కొట్టి చూపించే సత్తా ఈయనకి మాత్రమే ఉంది.ప్రస్తుతం ఇండియా లో ఉన్న యంగ్ ప్లేయర్ల లో ఒక బౌలర్ బాల్ వేసే ముందే ఆయనతో సిక్స్ కొడుతాను అని చెప్పి మరి సిక్స్ కొట్టగలిగే ఒకేఒక్క ఇండియన్ బ్యాట్సమెన్ రింకు సింగ్ అనే చెప్పాలి… ఈయన ఇండియాలోనే కాదు ప్రపంచం లోనే నెంబర్ వన్ ఫినిషర్ గా మారుతాడు అని అనడం లో ఎలాంటి సందేహం అయితే లేదు…