Janasena TDP: జనసేనతో బీజేపీ కటీఫ్.. టీడీపీ దోస్తానా?

Janaesna TDP: పొత్తు పెట్టుకున్న మిత్రులు విభేదిస్తున్నారు. అసలు పొత్తే లేని నేతలు మాత్రం మాట మీద నిలబడి వైదొలుగుతున్నారు. ఏపీలోని ‘బద్వేలు’ ఉప ఎన్నిక రాజకీయం ఆంధ్రా భవిష్యత్ రాజకీయాలను పూర్తిగా మార్చివేస్తుందా? అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఏపీలో పొత్తు పెట్టుకున్న జనసేన-బీజేపీలో బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో భిన్నాభిప్రాయలతో విడిపోయాయి. పోటీకి జనసేనాని పవన్ కళ్యాణ్ దూరంగా జరుగుతూ చనిపోయిన వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతుగా ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చాడు. ఈ పిలుపును […]

Written By: NARESH, Updated On : October 4, 2021 8:33 pm
Follow us on

Janaesna TDP: పొత్తు పెట్టుకున్న మిత్రులు విభేదిస్తున్నారు. అసలు పొత్తే లేని నేతలు మాత్రం మాట మీద నిలబడి వైదొలుగుతున్నారు. ఏపీలోని ‘బద్వేలు’ ఉప ఎన్నిక రాజకీయం ఆంధ్రా భవిష్యత్ రాజకీయాలను పూర్తిగా మార్చివేస్తుందా? అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఏపీలో పొత్తు పెట్టుకున్న జనసేన-బీజేపీలో బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో భిన్నాభిప్రాయలతో విడిపోయాయి. పోటీకి జనసేనాని పవన్ కళ్యాణ్ దూరంగా జరుగుతూ చనిపోయిన వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతుగా ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చాడు. ఈ పిలుపును బీజేపీ కాలదన్ని పోటీకి రెడీ అయ్యింది. తన పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ పిలుపునే పక్కన పెట్టి బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఏకంగా బద్వేలు బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ట్విస్ట్ ఏంటంటే.. పొత్తు పెట్టుకున్న ఏబీ బీజేపీ పవన్ మాటను పెడచెవిన పెడుతుండగా.. పొత్తులో లేని పాత మిత్రుడు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ‘బద్వేలు’ ఉప ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న పవన్ పిలుపునకు పాజిటివ్ గా స్పందించి పోటీ నుంచి తప్పుకోవడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

పవన్ కళ్యాణ్ చెప్పినట్టే బద్వేలు బరి నుంచి టీడీపీ తప్పుకుంటున్నట్టు ప్రకటించడం ఇప్పుడు పెను సంచలనమైంది. పవన్ మాటకు విలువనిచ్చి చంద్రబాబు ఇంత త్యాగం చేస్తే.. పొత్తు పెట్టుకున్న బీజేపీ మాత్రం పెడచెవిన పెట్టి పోటీకి రెడీ కావడం విశేషంగా మారింది.

దీంతో బీజేపీ-జనసేన పొత్తు పొడుపులకు చెక్ పడుతుందా? జనసేనతో టీడీపీ దగ్గర కాబోతోందా? అన్న చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ మాటకు ఇంత విలువ ఇచ్చి టీడీపీ అధినేత వైదొలగడం ఎంత లేదన్న పవన్ ను టెంప్ట్ చేస్తుంది. ఆ టెంప్టింగ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు టీడీపీకి పవన్ దగ్గరైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. విలువలతో రాజకీయం చేస్తానన్న పవన్.. ఆయన మాటకు విలువనిచ్చే చంద్రబాబును ఎలా వదులుకుంటాడన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది.

ఒక వేళ నిజంగానే పవన్ కండీషన్లకు చంద్రబాబు ఈజీగా ఒప్పేసుకుంటాడు. అదే నిజమైతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పొడవడం ఖాయం. బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా ఏపీలో బలమైన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అండగా ఉంటే జనసేనాని పవన్ ఏదైనా సాధించగలరు. కాలం కలిసి వస్తే సీఎం అయ్యే చాన్స్ కూడా ఉంటుంది.

సో ఏపీలో పెద్దగా బలం లేని బీజేపీ దూరం కావడం.. టీడీపీ దగ్గర కావాలని ప్రయత్నించడం ఓ రకంగా పవన్ కళ్యాణ్ కే మేలు అని.. జనసేనకు కాలం కలిసి వస్తోందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.