ఇలాంటి కరోనా విపత్కర సమయంలో కార్పొరేట్ ఆస్పత్రుల తీరు తెలంగాణలో దారుణంగా ఉందని.. కరోనా రోగుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం అని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో కరోనాపై చర్చ సందర్బంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఐఏఎస్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. టాస్క్ ఫోర్స్ తీసుకునే చర్యలపై వారానికి ఒకసారి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతలకు పంపిస్తామని.. వారు సలహాలు సూచనలు ఇవ్వొచ్చని కేసీఆర్ అన్నారు. తద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల కరోనా దోపిడీని అరికడుతామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.
Also Read: కాంగ్రెస్ దయ వల్లే కేసీఆర్ కు ఇంత క్రెడిటా?
రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో వసూలు చేస్తున్న ఫీజులు, ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల కార్మికుల సమస్యలపై సీఎల్పీ నేత భట్టి విక్కమార్క కాస్త గట్టిగానే అసెంబ్లీలో కేసీఆర్ నిలదీశారు. దీంతో కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక కరోనా మరణాలు దాచేస్తున్నారని విమర్శలు చేస్తున్నారని.. వాటిని ఎవరైనా దాచేస్తారా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. మృతిచెందితే వారి కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియదా అని కేసీఆర్ ప్రశ్నించారు. కరోనా నుంచి రాష్ట్రం ఆర్థికంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అన్నారు.డబ్బులకు గతిలేని పరిస్థితుల్లో తెలంగాణ లేదన్నారు. ప్రజారోగ్యమే తమకు ముఖ్యమన్నారు.
Also Read: కేసీఆరా..మజాకా? మొత్తం బుల్లెట్ ఫ్రూఫ్ పో..!
తెలంగాణనే కాదు.. యావత్ ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తోందని.. కేంద్రం ఆయుష్మాన్ కంటే మన ఆరోగ్యశ్రీ బెటర్ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో మద్యం దుకాణాల కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే మద్యం దుకాణాల ద్వారా బాగా అమ్ముతున్నారని కాంగ్రెస్ విమర్శలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు.