https://oktelugu.com/

అఖిల్ మీద 70 కోట్లు అంటే.. కష్టమే !

మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో సైరా తీశాక.. ఇక సురేందర్ రెడ్డి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు.. ? అసలు అతనికి ఛాన్స్ ఇచ్చే స్టార్ ఉన్నాడా ? అని అనేక అనుమానాలు అనంతరం మొత్తానికి క్లారటీ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠతో సాగిన ఈ అంశం పై సస్పెన్స్ వీడింది. అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి చేయబోయే సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. నిజానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా […]

Written By:
  • admin
  • , Updated On : September 9, 2020 / 05:24 PM IST
    Follow us on


    మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో సైరా తీశాక.. ఇక సురేందర్ రెడ్డి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు.. ? అసలు అతనికి ఛాన్స్ ఇచ్చే స్టార్ ఉన్నాడా ? అని అనేక అనుమానాలు అనంతరం మొత్తానికి క్లారటీ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠతో సాగిన ఈ అంశం పై సస్పెన్స్ వీడింది. అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి చేయబోయే సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. నిజానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోందని గత కొన్ని రోజులు క్రితమే రూమర్స్ వచ్చాయి. అయితే సురేందర్ రెడ్డి మాత్రం, అఖిల్ తో సినిమా చేయాలనుకోలేదు. సైరా లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడిగా తన తరువాత సినిమాని కూడా అంతే భారీగా ఆ రేంజ్ స్టార్ తోనే ఊహించుకున్నాడు సురేందర్ రెడ్డి. కానీ, అది వర్కౌట్ అవ్వలేదు.

    Also Read: హిట్ కొట్టలేకపోయినా.. స్పీడ్ మాత్రం తగ్గట్లేదు !

    నిజానికి ప్రభాస్ చుట్టూ కథ పట్టుకుని తిరిగాడు కూడా. రచయిత చిన్నికృష్ణ రాసిన కథను ప్రభాస్ కి కూడా వినిపించారు. అయితే, ప్రభాస్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల కారణంగా సురేందర్ రెడ్డి చెప్పించిన కథకు ప్రభాస్ నుండి ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ సినిమా ఒప్పుకున్నా ఇప్పట్లో డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక చేసేది ఏమిలేక తన తరవాత సినిమా హీరోల లిస్ట్ లో నుండి సురేందర్ రెడ్డి కష్టంగానే, రెబల్ స్టార్ ప్రభాస్ పేరును తొలిగించుకుని, మొత్తానికి అఖిల్ తో సినిమాని సెట్ చేసుకున్నాడు. అయితే అఖిల్ సినిమా కంటే ముందు రవితేజతో ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపించింది.

    Also Read: మహేష్ బాబు, మామ కృష్ణ సాయం అడగకుండా ఎదిగాను

    ఆ మేరకు కొన్ని సిట్టింగ్ లు కూడా జరిగాయని.. కాకపోతే రవితేజతో సినిమా అంటే బడ్జెట్ పరిమితులు ఉన్నాయని, కనీసం డెబ్భై కోట్లు లేనిది సినిమా వర్కౌట్ అవ్వదు అని.. ఎవ్వరూ రవితేజ మీద అంత బడ్జెట్ పెట్టడానికి ముందుకు రాకపోవడంతోనే, మళ్ళీ సురేందర్ రెడ్డి అఖిల్ తో లైన్ లోకి వచ్చాడని తెలుస్తోంది. ఇప్పుడు అఖిల్ హీరోగా వక్కంతం వంశీ కథతో రానున్న ఈ సినిమాకి నిర్మాత అనిల్ సుంకర డెబ్భై కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చాడట. అందుకే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిందట. అఖిల్ ప్రస్తుతం చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ సినిమా తరువాత చేయబోయే సినిమా సురేందర్ రెడ్డిదే. కాకపోతే అఖిల్ కి ప్రస్తుతం డెబ్భై కోట్లు మార్కెట్ లేదు. ఈ కరోనా కాలంలో అఖిల్ మీద అంత భారీ మొత్తాన్ని పెట్టడం అంటే.. కచ్చితంగా అది రిస్క్ అవుతుంది.