హిట్ కొట్టలేకపోయినా.. స్పీడ్ మాత్రం తగ్గట్లేదు !

టాలీవుడ్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కి స్టార్ డమ్ రాలేదు గాని, కాస్త కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడని.. అలాగే వైవిధ్యమైన సినిమాలు చేస్తాడనే పేరు అయితే వచ్చింది. ఆ మాటకొస్తే స్టార్ కుటుంబాల నుండి వారసులుగా వచ్చిన తెలుగు హీరోలందరిలో కల్లా మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలను కథలను ఎంచుకుంటూ వస్తోన్న హీరో బహుశా కళ్యాణ్ రామ్ ఒక్కడే అని చెప్పుకోవాలేమో. ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క నిర్మాతగానూ పది సినిమాలను చేయడమే కాకుండా, ఆ […]

Written By: admin, Updated On : September 9, 2020 4:31 pm
Follow us on


టాలీవుడ్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కి స్టార్ డమ్ రాలేదు గాని, కాస్త కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడని.. అలాగే వైవిధ్యమైన సినిమాలు చేస్తాడనే పేరు అయితే వచ్చింది. ఆ మాటకొస్తే స్టార్ కుటుంబాల నుండి వారసులుగా వచ్చిన తెలుగు హీరోలందరిలో కల్లా మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలను కథలను ఎంచుకుంటూ వస్తోన్న హీరో బహుశా కళ్యాణ్ రామ్ ఒక్కడే అని చెప్పుకోవాలేమో. ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క నిర్మాతగానూ పది సినిమాలను చేయడమే కాకుండా, ఆ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లోనూ కళ్యాణ్ రామ్ నటించాడు. తన సినిమాలకు ఎవరేజ్ మార్కెట్ నే ఉన్నా.. ఎప్పుడూ తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు చేయాలనే నియమాలను పెట్టుకోకుండా.. ఏదైనా కథను బట్టే చేయాలనే పద్ధతిని ఫాలో అవుతున్న హీరో కూడా కళ్యాణ్ రామ్ ఒక్కడే. అందుకే తనకంటూ ఓ ఇమేజ్ ను సాధించాడు.

Also Read: పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. !

అయితే, కళ్యాణ్ రామ్ కెరీర్ మాత్రం ఎప్పుడూ వెనుకే ఉండిపోయింది. పాపం ఎంత చేసినా.. ఎన్ని మంచి సినిమాలు చేసినా కనీసం సెకెండ్ గ్రేడ్ స్టార్ ల వరుసలో కూడా కళ్యాణ్ రామ్ నిలబడలేకపోయాడనే బాధ ఉంది నందమూరి అభిమానుల్లో. దానికి తోడు కళ్యాణ్ రామ్ కి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అయిపోయింది. నిజానికి పటాస్ తరువాత ఆ రేంజ్ హిట్ కళ్యాణ్ రామ్ కెరీర్ లో లేదు. పైగా సినిమాలను కూడా బాగా తగ్గిస్తూ చేస్తున్నాడు. ఇక చేసిన గత కొన్ని సినిమాలు కూడా ప్లాప్ లు అయ్యాయి. మధ్యలో 118 అనే సినిమా పర్వాలేదనిపించినా బాక్సాపీస్ వద్ద ఆ సినిమాకి పెద్దగా కలెక్షన్స్ రాలేదు. ఇలా కళ్యాణ్ రామ్ వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేక సతమతమవుతున్నా.. సినిమాల వేగాన్ని మాత్రం తగ్గించట్లేదు.

Also Read: ఏడుపులు తగలెయ్యా.. ట్రోల్స్ దెబ్బకు.. వామ్మో అంటున్న ‘బిగ్ బాస్’

కొత్తగా వినాయక్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రమేష్ అనే కొత్త డైరెక్టర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ కి పని చేసిన రవి కాంత్ అనే అతని కథకు కూడా ఇప్పటికే ఓకే చెప్పాడు. వశిష్ట అనే మరో కొత్త డైరెక్టర్ సినిమాని కూడా త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నాడు. ప్రస్తుతం ఆల్ రెడీ మొదలుపెట్టిన సినిమాలు రెండు ఉన్నాయి. అయినా కళ్యాణ్ రామ్ మాత్రం మారో వైవిధ్యమైన సినిమా చేయటానికి సిద్ధం అవుతున్నాడు. కరోనా పరిస్థితులు పోయాక ఈ సినిమాని మొదలు పెట్టనున్నారని.. అయితే ఈ సినిమా కథ ఒక దొంగ జీవితానికి సంబంధించినది అని, ఈ సినిమాకి దర్శకుడు చెైతన్య అని తెలుస్తోంది. దర్శకుడిగా తన మొదటి చిత్రమైన ‘బాణం’తో చెైతన్యకు మంచి పేరు వచ్చింది. కానీ, సక్సెస్ మాత్రం రాలేదు. మరి కళ్యాణ్ రామ్ సినిమాతోనైనా సక్సెస్ కొడతాడేమో చూడాలి.