https://oktelugu.com/

ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై కేసీఆర్ ఫైర్

తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకొని.. కేసీఆర్‌‌ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొచ్చారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే.. ఆయనకు తెలంగాణ ప్రజలు రెండుసార్లు పట్టం కట్టారు. అయితే.. కేసీఆర్‌‌ మొదటి సారి సీఎం అయినప్పటి దూకుడు ఈ సెకండ్‌ ఫేస్‌లో కనిపించడం లేదట. పార్టీ నాయకుల పట్ల కూడా ఆయన కాస్త ఉదాసీనతతో ఉన్నట్లుగా అంటున్నారు. కానీ.. దీనిని అలుసుగా తీసుకున్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా చివరకు జిల్లా స్థాయి లీడర్లు కూడా రెచ్చిపోతున్నారు. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2021 / 10:58 AM IST
    Follow us on


    తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకొని.. కేసీఆర్‌‌ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొచ్చారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే.. ఆయనకు తెలంగాణ ప్రజలు రెండుసార్లు పట్టం కట్టారు. అయితే.. కేసీఆర్‌‌ మొదటి సారి సీఎం అయినప్పటి దూకుడు ఈ సెకండ్‌ ఫేస్‌లో కనిపించడం లేదట. పార్టీ నాయకుల పట్ల కూడా ఆయన కాస్త ఉదాసీనతతో ఉన్నట్లుగా అంటున్నారు. కానీ.. దీనిని అలుసుగా తీసుకున్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా చివరకు జిల్లా స్థాయి లీడర్లు కూడా రెచ్చిపోతున్నారు.

    Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. జగన్, కేసీఆర్ లో టెన్షన్

    ఇప్పుడు ఇదే రాష్ట్రంలో అధికార పార్టీకి మైనస్‌ అవుతోంది. అందుకే పార్టీకి ప‌ట్టున్న గ్రామ‌స్థాయి నుంచే టీఆర్ఎస్‌పై వ్యతిరేక‌త స్టార్ట్ కావ‌డంతో పాటు అటు వ‌రుస ఎన్నిక‌ల్లోనూ ఎదురుదెబ్బలు త‌గులుతున్నాయి. 2014 నుంచి తెలంగాణ‌లో ఏ ఎన్నిక లేదా ఉప ఎన్నిక జ‌రిగినా టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు జంకు ఉండేది కాదు. మారిన ప‌రిస్థితులు.. బీజేపీ దూకుడు నేప‌థ్యంలో ఇటు దుబ్బాక ఉప పోరులో దెబ్బ గ్రేట‌ర్‌‌లో అంచ‌నాలు త‌ల్లకిందులు కావ‌డంతో కేసీఆర్‌లో క‌ద‌లిక వ‌చ్చింది. దీంతో పార్టీలో మంత్రుల స్థాయి నుంచే ప్రక్షాళ‌న ప్రారంభించారు.

    ఇప్పటికే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సీజన్‌ నడుస్తుండడంతో.. ఎన్నిక‌ల్లో వారి ప‌రిధిలో రిజల్ట్ రాక‌పోతే ప‌ద‌వులు పీకేయ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు కూడా ఉండ‌వ‌ని సీరియ‌స్‌గా ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. తెలంగాణ‌లో ఇప్పుడు వ‌రుస ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక‌తోపాటు రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు సైతం ఎన్నిక‌లు త్వర‌లోనే ఉన్నాయి. దీంతో ఈ ఎన్నిక‌ల్లో గెలుపు బాధ్యత‌ల‌ను కేసీఆర్ పూర్తిగా మంత్రులు, ఎమ్మెల్యేల మీదే వేసేశారు. వారికి టార్గెట్లు, కండీష‌న్లు కూడా పెట్టేసిన‌ట్టు తెలుస్తోంది.

    Also Read: రేపే పుర పోలింగ్.. 4 మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం..

    హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నేతలకు పీవీ కుమార్తె సుర‌భి వాణీని గెలిపించుకురావాల‌ని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు.. ఒక్కో జిల్లాకు ముగ్గురు మంత్రుల‌కు ఇన్‌చార్జి బాధ్యత‌లను కేసీఆర్ ఇచ్చారు. ఇక ఇటీవల గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు స‌రిగా రాబ‌ట్టలేక‌పోయినా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్‌తోపాటు ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రన‌గ‌ర్‌)– దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీన‌గ‌ర్‌)– ముఠాగోపాల్ (ముషీరాబాద్) కు త‌లంటేశార‌ట‌. అతి ధీమాతోపాటు ఉదాసీన వైఖ‌రి వ‌ల్లే మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఓడిపోవ‌డంతో పాటు ప‌రువు పోయింద‌ని ఫైర్ అయ్యార‌ట‌.

    ఈ ఎన్నికల్లో అయినా పాజిటివ్‌ ఫలితాలు రాకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కష్టమని చెప్పారట. ఇదే రూల్ ఇప్పుడు సాగ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, రెండు ఎమ్మెల్సీ స్థానాల బాధ్యుల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని అంటున్నారు. సాగ‌ర్ బాధ్యత‌లు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డిపై పెట్టారు. వ‌రంగ‌ల్ బాధ్యత‌లు ఆ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేల‌కు అప్పగించారు. ఖమ్మం బాధ్యత ప్రధానంగా మంత్రి పువ్వాడ అజ‌య్‌పైనే ఉంది. మ‌రి ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రెండింట్లోనూ కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అభ్యర్థుల‌ను నిల‌బెట్టారు. పైగా పీవీ కుమార్తెను లాగారు. అక్కడ పార్టీకి అంత సానుకూల‌త లేదు. రిజ‌ల్ట్ తేడా వ‌స్తే పీవీ కుటుంబానికే అవ‌మానం. అందుకే అక్కడ బాధ్యత‌లు తీసుకున్న వారు ఏం చేయాలో తెలియ‌క త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్