America Exit Afghanistan : ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) నుంచి అమెరికా(America), నాటో దళాలు వెనుదిరగడంతో తాలిబన్లకు ఆయుధాలు చిక్కకుండా అగ్రరాజ్యం తమ ఆయుధాలను కొన్నింటిని నాశనం చేసినప్పటికీ ఇప్పటికే లక్షలాది ఆయుధాలు ఉగ్రవాదులకు చిక్కాయి.
అమెరికా వదిలిపెట్టిన చినూక్ హెలికాప్టర్లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.కాబూల్ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని గంటల క్రితం తాలిబన్లు విమానాశ్రయంలోని చినూక్ హెలికాప్టర్లను పరిశీలించారు. వారు చినూక్ హెలికాప్టర్లను పరిశీలిస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి.
కాగా, ఎవరూ ఊహించనంత వేగంగా కొన్ని రోజుల క్రితమే కాబూల్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ఇప్పటికే.. గతంలో అమెరికా ఆఫ్ఘన్‌కు అందించిన 6 లక్షల పలు రకాల ఆయుధాలు, ఎం16 అస్సాల్ట్స్ రైఫిళ్లు, 1,62,000 కమ్యూనికేషన్ పరికరాలు, 16, 000 నైట్ విజన్ గాగుల్స్ ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.