
Taliban: మనుషులకు , మృగాలకు ఒకటే తేడా.. మనుషుల్లో మానవత్వం ఉంటుంది.. మృగాలకు ఆ తేడా లేదు. చంపి తినేస్తాయి. కానీ మృగాలకు మించి కృరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి అప్ఘనిస్తాన్ లోని తాలిబన్ల (Taliban) ఉగ్రమూక. అమెరికా సైన్యం నిన్న వైదొలగడంతో అప్ఘనిస్తాన్లో తాలిబన్ల అరాచకం మొదలైంది.
అమెరికా సైన్యం వదిలేసి వెళ్లిన ఆయుధాలు, హెలిక్యాప్టర్లు, విమానాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. చేసుకోవడమే కాదు.. తాజాగా తమ వ్యతిరేకులైన ఒక వ్యక్తిని చంపేసి ఆ హెలిక్యాప్టర్ కు మృతదేహాన్ని కట్టేసి కాందహార్ లో ఊరేగారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు జర్నలిస్టులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తాలిబన్ల దారుణాలు వెలుగుచూశాయి.
తొలుత ఆ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపిన తాలిబన్లు ఆపై అమెరికా మిలటరీ హెలిక్యాప్టర్ కు ఆ మృతదేహాన్ని తాడుతో కట్టి కాందహార్ మొత్తం చక్కర్లు కొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
అయితే వీడియోలో హెలిక్యాప్టర్ కు తాడుతో వేలాడుతున్న వ్యక్తి సజీవంగా ఉన్నాడా? లేక అది మృతదేహమా? అన్నది స్పష్టంగా కనిపించడం లేదు. అయితే చంపేసిన వ్యక్తినే తాలిబన్లు ఇలా వేలాడదీస్తూ హెలిక్యాప్టర్ లో ప్రదర్శన పెట్టి తమ క్రూరత్వాన్ని ప్రజలకు చూపించారని చెబుతున్నారు. ఎదురుతిరిగిన వారికి ఈ గతి పట్టిందని హెచ్చరించడానికే ఇలా చేసి ఉంటారని చెబుతున్నారు.
తాలిబన్ టైమ్స్ ట్విట్టర్ మాత్రం అదంతా తమ ప్రదర్శన అని.. కేవలం విన్యాసాలు అంటోంది. అయితే జర్నలిస్టులు మాత్రం చంపేసి వేలాడదీశారని అంటున్నారు.
అమెరికా అప్ఘనిస్తాన్ ను వీడుతూ 73 విమానాలు, 27 హమ్వీస్ హెలిక్యాప్టర్లు, ఆయుధ సంపత్తి, ఇతర హైటెక్ డిఫెన్స్ పరికరాలను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. కానీ ఇప్పుడు తాలిబన్లు అమెరికా హెలిక్యాప్టర్ ను నడుపుతూ శవంతో ఊరేగించారు. దీంతో అమెరికా విమానాలు, హెలిక్యాప్టర్లతో తాలిబన్లు ఎన్ని అరాచకాలు చేస్తారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Here's one more close-up video. The person can be seen waving his hand. pic.twitter.com/p4LSpkV3cF
— Mohammed Zubair (@zoo_bear) August 31, 2021