Homeజాతీయ వార్తలుకేరళ సీఎంపై గోల్డ్ ట్రాప్!.. విపక్షాల చేతికి ఆయుధం

కేరళ సీఎంపై గోల్డ్ ట్రాప్!.. విపక్షాల చేతికి ఆయుధం

Swapna Suresh and Pinarayi Vijayan
గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు కేరళలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే.. ఈ కేసులో సీఎం పినరయి విజయన్‌ ఉన్నారంటూ.. ఆ కేసులో నిందితురాలిగా ఉన్న స్వప్నా సురేశ్‌ సంచలన ఆరోపణలు చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు చెబుతున్నారు. మరో ముగ్గురు మంత్రులు ఎలా స్మగ్లింగ్ చేసేవారు.. సీఎంకు ఎలా సంబంధం ఉందో.. స్వప్నా సురేశ్‌ చెప్పారంటూ.. ఓ క్రైం సీరిస్‌లా మీడియాకు లీకులు ఇచ్చారు. కేరళలో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.

Also Read: చంద్రబాబుకు మంచి రోజులు..!.. మోడీ కమిటీలో జగన్‌, చంద్రబాబుకు చోటు

ఎందుకంటే.. ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసును సీఎం పినరయి విజయన్ ఎప్పుడో కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేశారు. ఎన్‌ఐఏ ఈ కేసు విచారణ నిర్వహిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని ఎలా వాడుకుంటుందో తెలిసినా పినరయి విజయన్ తనపై వస్తున్న విమర్శలను తట్టుకునేందుకు కేసును ఎన్‌ఐఏకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేరళ సర్కార్ నిర్ణయం మేరకు ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది. విచారణ జరుపుతోంది. ఎక్కడా.. సీఎం విజయన్‌కు ప్రమేయం ఉన్నట్లుగా బయటకు రాలేదు.కానీ.. ఎన్‌ఐఏ ఎంక్వైరీ చేసి గతేడాది అక్టోబర్‌‌లో కొచ్చిలోని న్యాయస్థానానికి కొన్ని వివరాలు అందించింది.

దాని ప్రకారం ఈ గోల్డ్ స్మగ్లింగ్‌లో దావూద్ ఇబ్రహీం ప్రమేయం ఉందని ఎన్‌ఐఏ తెలిపింది. మహమ్మద్ షఫీ అనే వ్యక్తి ఈ బంగారం అక్రమ రవాణాలో ప్రధాన సూత్రధారి అని పేర్కొంది. అంతే కానీ ప్రభుత్వానికి.. సీఎంకు సంబంధం ఉందని ఎక్కడా వెల్లడి కాలేదు. అయితే.. కొత్తగా కస్టమ్స్ పేరుతో స్వప్నా సురేశ్‌ వాంగ్మూలం అంటూ.. సీఎంపేరును లీక్ చేశారు. కేరళలో వరుసగా రెండో సారి సీఎం పినరయి విజయన్ ముఖ్యమంత్రి అవుతారని వివిధ సర్వేలు వెల్లడిస్తున్న సమయంలో.. ఈ వార్తలు కేరళలో సహజంగానే కలకలం రేపుతున్నాయి. ఆయనపై బీజేపీ మార్క్ కుట్ర చేస్తోందన్న చర్చ జరగడానికి కారణం అవుతోంది.

Also Read: కేంద్రానికి ఎన్నికల సంఘం షాక్… ఆ ఆదేశాల వెనుక తృణమూల్‌ కాంగ్రెస్

గత ఏడాది జూలై 5వ తేదీన యూఏఈ నుంచి దౌత్య మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బంగారాన్ని కొచ్చి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్లొమాటిక్ కార్గో ద్వారా ఇంత పెద్ద మొత్తంలో బంగారం తరలించడం సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న స్వప్న సురేశ్‌.. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రధాన కార్యదర్శికి ఎం శివశంకర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆరోపణలు రావడంతో ఆయనను విజయన్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విజయన్ పాత్రపై ఎన్నికల సమయంలోనే వివరాలు బయటకు రావడం వెనుక.. ఎన్నికల వ్యూహమే ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మరోవైపు విపక్షాలు సైతం దీనిని ఆయుధంగా మలచుకోనున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version