బీజేపీ విషయంలో కేటీఆర్‌‌ రూట్‌ మార్చారా.. అందుకే ఇలా అటాక్ చేస్తున్నారా..?

ఇన్ని రోజులు తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌ను బీజేపీ ఎంతలా ఇబ్బంది పెట్టినా.. ఎన్ని మాటలు అన్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌.. బీజేపీ పట్ల సాఫ్ట్‌ కార్నర్‌‌ను మెల్లమెల్లగా పక్కన పెడుతున్నారు. ఆయన రాష్ట్ర బీజేపీ నేతలపై ఎదురుదాడి చేయడం కంటే.. కేంద్రంపై ఎటాకింగ్ పాలిటిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ సహా తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేంద్ర వైఖరిని ఎప్పటికప్పుడు.. తప్పు పడుతూ వస్తున్నారు. […]

Written By: Srinivas, Updated On : March 6, 2021 1:08 pm
Follow us on


ఇన్ని రోజులు తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌ను బీజేపీ ఎంతలా ఇబ్బంది పెట్టినా.. ఎన్ని మాటలు అన్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌.. బీజేపీ పట్ల సాఫ్ట్‌ కార్నర్‌‌ను మెల్లమెల్లగా పక్కన పెడుతున్నారు. ఆయన రాష్ట్ర బీజేపీ నేతలపై ఎదురుదాడి చేయడం కంటే.. కేంద్రంపై ఎటాకింగ్ పాలిటిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ సహా తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేంద్ర వైఖరిని ఎప్పటికప్పుడు.. తప్పు పడుతూ వస్తున్నారు.

Also Read: చంద్రబాబుకు మంచి రోజులు..!.. మోడీ కమిటీలో జగన్‌, చంద్రబాబుకు చోటు

తాజాగా.. కేంద్రం గుజరాతి ప్రాధాన్యతను కూడా హైలెట్ చేస్తున్నారు. బుల్లెట్ ట్రైన్‌ను గుజరాత్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారని.. హైదరాబాద్‌కు ఎందుకు అర్హత లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సమావేశంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ ప్లస్ పాయింట్లను చెప్పడమే కాదు కేంద్రం నిరాదరణను కూడా ప్రభావవంతంగా వ్యక్తం చేశారు.

బుల్లెట్ ట్రైన్ అంశంపై ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్రంపై విమర్శలు వస్తున్నారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తూ.. లక్ష కోట్లకుపైగా ఖర్చుపెట్టి.. గుజరాత్‌కు.. బుల్లెట్ ట్రైన్ వేయడం అంటున్నారు. అంతే కాదు.. దేశంలో ఎన్నో సుప్రసిద్ధ నగరాలు.. అభివృద్ధి చెందాల్సినవి ఉండగా అహ్మదాబాద్‌కు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు కూడా హైలెట్ అవుతున్నాయి. కేటీఆర్ విమర్శలు బీజేపీ నేతలను సూటిగా తగులుతున్నాయి. వారు ఇప్పుడు కిందా మీదా పడి విమర్శలు చేస్తున్నారు. ఆ హామీలన్నీ బీజేపీ నెరవేర్చకపోవడానికి టీఆర్ఎస్సే కారణం అని వాదించడం కూడా చేస్తున్నారు.

Also Read: వైసీపీకి హైకోర్టు షాక్‌.. వారి సెల్‌ఫోన్లు అధికారులకు ఇవ్వాల్సిందే..

అయితే.. కేటీఆర్ మాత్రం వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్నే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. మామూలుగా గ్రేటర్ ఎన్నికల తరువాత కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత బీజేపీ విషయంలో ఒక్కసారిగా సైలెంటయ్యారు. ఇదే అదనుగా.. బీజేపీ నేతలు చెలరేగిపోయారు. మౌనాన్ని ఆసరాగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలను బీజేపీ నేతలు చేస్తుండటంతో టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. అయితే.. కేంద్రాన్ని మాత్రం ఏమీ అనలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం మళ్లీ రూట్ మార్చినట్లుగా కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్