చంద్రబాబుకు మంచి రోజులు..!.. మోడీ కమిటీలో జగన్‌, చంద్రబాబుకు చోటు

ఏపీ సీఎం జగన్‌కు.. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా భగ్గుమనే రాజకీయ కక్షలు. ఎప్పటికైనా వారు రాజకీయ శత్రువులనేది వాస్తవం. ఏపీ సీఎం జగన్ మరో ఇద్దరో.. ముగ్గురో టీడీపీ ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటే చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయే ప్రమాదమే ఉంది. కానీ.. అలాంటి క్రమంలో జగన్‌, చంద్రబాబు కలిసి ఒక కమిటీలో పనిచేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి..? ప్రధాని మోడీ కూడా చంద్రబాబుకు ప్రత్యేక గౌరవం […]

Written By: Srinivas, Updated On : March 6, 2021 1:56 pm
Follow us on


ఏపీ సీఎం జగన్‌కు.. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా భగ్గుమనే రాజకీయ కక్షలు. ఎప్పటికైనా వారు రాజకీయ శత్రువులనేది వాస్తవం. ఏపీ సీఎం జగన్ మరో ఇద్దరో.. ముగ్గురో టీడీపీ ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటే చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయే ప్రమాదమే ఉంది. కానీ.. అలాంటి క్రమంలో జగన్‌, చంద్రబాబు కలిసి ఒక కమిటీలో పనిచేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి..? ప్రధాని మోడీ కూడా చంద్రబాబుకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు.

Also Read: వైసీపీకి హైకోర్టు షాక్‌.. వారి సెల్‌ఫోన్లు అధికారులకు ఇవ్వాల్సిందే..

భారత్ వచ్చే ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణను ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నారు. అందుకోసం కమిటీని నియమించారు. ఆ కమిటీలో సహజంగానే ముఖ్యమంత్రులకు చోటు లభించింది. త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ, రాజ్యసభల్లో వివిధ పక్షాల నాయకులకు హోదాల ప్రకారం చాన్స్ కల్పించారు. వారితోపాటు మరికొంత మంది ప్రముఖులకు చోటు కల్పించారు. వారిలో చంద్రబాబు, రామోజీరావు, భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా కూడా ఉన్నారు.

Also Read: టీడీపీకి ఏమవుతోంది.. చంద్రబాబుకు ఎందుకీ దుస్థితి?

అలాగే క్రీడా రంగం నుంచి పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు, మిథాలీరాజ్‌లకు స్థానం దక్కింది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. తక్షణం ఈ కమిటీ అమల్లోకి వచ్చినట్లేనని కేంద్రం వెల్లడించింది. ఈ కమిటీ తొలి సమావేశం ఎనిమిదో తేదీన జరగనుంది. రాజకీయ పరంగా విభేదిస్తున్న చంద్రబాబును.. మోడీ చాలా కాలంగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

కరోనా కాలంలో ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై దేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఫోన్ చేశారు కానీ చంద్రబాబును లైట్ తీసుకున్నారు. అయితే.. చంద్రబాబు తానే పీఎంవోకు ఫోన్ చేసి మాట్లాడి తన ఆలోచనలను నివేదిక రూపంలో పంపించారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు విషయంలో మోడీ సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు రాలేదు. ఇప్పుడు.. స్వాతంత్ర్య దినోత్సవ కమిటీలో మాత్రం ఆయనకు చోటు కల్పించారు. పద్నాలుగేళ్లు సీఎంగా చేయడం.. సుదీర్ఘ కాలం కీలక పాత్ర పోషించిన కారణంగా చంద్రబాబుకు ఛాన్సిచ్చారని అంచనా. మొత్తంగా జగన్‌, చంద్రబాబు ఇప్పుడు ఒక కమిటీ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకోబోతున్నారు.