Brahmananadam : టాలీవుడ్ హాస్యనటుడు, మీమ్స్ బ్రహ్మా, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో టాప్ కమెడియన్ గా ఆయన కొనసాగుతున్నారు. ఆయన వెండి తెర మీద కనిపించాడంటే నవ్వులు పూయాలంతే. ఇప్పటి వరకు ఆయన 1200కి పైగా చిత్రాల్లో నటించారు. తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు. అన్ని సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ప్రస్తుతం “బ్రహ్మా ఆనందం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో, తన తాజా సినిమా ప్రమోషన్లు చేసేందుకు బ్రహ్మానందం ఇటీవల ఇంటర్వ్యూలు ఇస్తూ తన సరదాగా కామెంట్స్ తో అలరించారు.
ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా, “బ్రహ్మా ఆనందం” చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. అయితే, తాజాగా బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన రాజకీయ నాయకుల గురించి చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తూ ఉన్నాయి. తాను చేస్తున్న సినిమాను ప్రమోట్ చేసుకుంటూ.. తన అనుభవాలను కలిపి పలు సూచనలు చేస్తూ, విలువైన విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సమయంలో తాజాగా చంద్రుడి వెన్నెలను, సముద్ర కెరటాలనూ పోలుస్తూ ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకుడు, ప్రజలు / కార్యకర్తలకు మధ్య ఉన్న బంధాన్ని చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. “చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగాలను రెచ్చగొడతాడు. పౌర్ణమి వచ్చిందంటే సముద్రం ఉప్పొంగి పోతుందంటాం కదా.. కానీ తను మాత్రం తారలను తన చుట్టు పెట్టుకుని ఆనందంగా ఉంటాడు. రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఉపన్యాసం ఇవ్వగానే.. మన కుర్రాళ్లు వెళ్లి అవి తగుల బెట్టి, ఇది చేసి, కిరసనాలు ఒంటిపై పోసుకుని తగలబెట్టుకునే విధంగా వాళ్లను రెచ్చగొడతాడు.. తాను మాత్రం తన పొజిషన్, చుట్టూ తన మంత్రుల పొజిషన్ తో సంతోషంగా ఉంటాడు” అని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పలు సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.
ఈ వ్యాఖ్యలు నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రజల మధ్య విస్తృతం చర్చలకు దారి తీస్తున్నాయి. “బ్రహ్మానందం మాటలు నిజమే” అంటూ కొన్ని సంఘటనలు, రాజకీయ ప్రస్థానాలను గుర్తు చేసుకుంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ప్రజలలో విరోధాన్ని పెంచుతున్న క్రమంలో ఈ ఇంటర్వ్యూ కామెంట్స్ వైరల్ గా మారినప్పటికీ, ఆయన తనదైన శైలిలో “బ్రహ్మా ఆనందం” సినిమాను మరింత ప్రచారం చేసుకుంటున్నారు.