Homeజాతీయ వార్తలుSuvendu Adhikari Warning: పారిపోవాల్సిందే..లేకుంటే వెంటపడి తరముతాం.. మమత వారసులకు సువేందు అధికారి హెచ్చరిక

Suvendu Adhikari Warning: పారిపోవాల్సిందే..లేకుంటే వెంటపడి తరముతాం.. మమత వారసులకు సువేందు అధికారి హెచ్చరిక

Suvendu Adhikari Warning: అనుకున్నట్టే జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ అక్రమ వలసదారుల నుంచి పూర్తిగా విముక్తమవుతోంది. ఇప్పటికే చికెన్ నెక్ కారిడార్ విషయంలో కేంద్రానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఈశాన్యరాష్ట్రాలకు విముక్తిని ప్రసాదించిన బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. మమతాబెనర్జీ 15 ఏళ్ల పరిపాలనా కాలంలో చేసిన తప్పులను ప్రక్షాళన చేస్తున్నారు.

15 సంవత్సరాల పాటు తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమతాబెనర్జీ బెంగాల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. చికెన్ నెక్ రహదారిని కేంద్రానికి ఇవ్వకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అంతేకాదు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి అక్రమంగా పౌరసత్వం హక్కులు కూడా ప్రసాదించింది. ఓటు, ఆధార్, నివాసం.. ఇలా ఒక్కటమేమిటీ అన్ని ఇచ్చేసింది. బెంగాల్ తన వారసత్వ ఆస్తి లాగా, ఈ దేశ ప్రజలకు దక్కాల్సిన ఫలాలను బంగ్లాదేశ్ వాసులకు పప్పూబెల్లాల్లాగా ఇచ్చేసింది.

సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మమత దుర్మార్గాలను, అవినీతి వ్యవహాలను తవ్వుతున్నాడు. మమత పాపాల చిట్టాను బయటపెడుతున్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్ వాసులను తరిమితరిమి కొడుతున్నాడు. ఈక్రమంలో వారికి సువేందు అధికారి కీలక హెచ్చరికలు జారీ చేశాడు. ‘బెంగాల్ లో మీకేం పని..గుర్తించి తరిమి తరిమి కొట్టే దాకా తెచ్చుకోకండి’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం భారతదేశంలో ఉన్న విదేశీయులు చట్టానికి లోబడి తాము వ్యవహరిస్తామని సువేందు అధికారి స్పష్టం చేశారు. తమ దేశం నుంచి పౌరులను స్వీకరిస్తామని బంగ్లాదేశ్ చెప్పిందని, ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ మీదు ఉందని సువేందు అధికారి గుర్తు చేశారు. అక్రమ చొరబాటుదారులను అరెస్ట్ చేయకూడదని సువేందు అధికారి పోలీసులకు సూచించారు. వారిని అరెస్ట్ చేస్తే భోజనం, సదుపాయం కల్పించాలని, అలా చేయడానికి వారు మన బంధువులు కాదని సువేందు అధికారి పేర్కొన్నారు.

మరోవైపు బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే అక్రమంగా ఉంటున్న వారిని బయటికి పంపించడానికి అనేక విధానాలను అమలు చేస్తోంది. గుర్తించి.. తొలగించి.. బయటికి పంపించండి అనే విధానాలను అమలు చేస్తూ విదేశీయులను దేశం నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని.. వారి వద్ద ఎటువంటి అధికారిక పత్రాలు లేని వారిని.. గుర్తించి తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు నిర్బంద కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి వారిని సొంతదేశాలకు పంపిస్తోంది. గత మంగళవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలో హకీంపూర్ ప్రాంతంలో దాదాపు వందలమంది బంగ్లాదేశ్ వాసులు గుమి గూడారు. ఆ తర్వాత వారు బంగ్లాదేశ్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు సర్ ప్రక్రియ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలానే బంగ్లాదేశ్ వాసులు వారి సొంత దేశానికి వెళ్లిపోయారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular