https://oktelugu.com/

సుశాంత్ ఆత్మహత్య.. బయటపడుతున్న డర్టీ సిక్రెట్స్.!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సుశాంత్ చావుకు నెపోటిజమే కారణమనే ఆరోపణలు రావడంతో నెటిజన్లు బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో పోలీసులకు డ్రగ్స్ లింకులు దొరకడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా ఇటీవల వెలుగు చూస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలిన చందంగా తెరవెనుక బాగోతాలు బయటికొస్తున్నాయి. Also Read: బన్నీ సినిమా షూటింగ్ పై […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 / 12:59 PM IST
    Follow us on

    sushant case

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సుశాంత్ చావుకు నెపోటిజమే కారణమనే ఆరోపణలు రావడంతో నెటిజన్లు బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో పోలీసులకు డ్రగ్స్ లింకులు దొరకడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా ఇటీవల వెలుగు చూస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలిన చందంగా తెరవెనుక బాగోతాలు బయటికొస్తున్నాయి.

    Also Read: బన్నీ సినిమా షూటింగ్ పై సుకుమార్ సంచలన నిర్ణయం

    ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీంతో పోలీసులతోపాటు మీడియా కూడా ఈ కేసుపై ఇన్విస్టిగేషన్ చేస్తూ సంచలన విషయాలను వెల్లడిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. ఆమె సోదరుడు షోవిక్, డ్రగ్ డీలర్ బాసిత్, శశాంక్ లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. రియాను ఎన్సీబీ అధికారులు విచారించగా పలువురు సెలబ్రెటీల పేర్లు చెప్పినట్లు వార్తలు విన్పించాయి.

    రియాతోపాటు రాణిని ద్వివేది, సంజనాలను కూడా పోలీసులు విచారించి పలు కీలక విషయాలను తెలుసుకున్నారు. వీరితోపాటు పలువురు సెలబ్రెటీలకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు మొదలయ్యాయి. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్లు.. నిర్మాతల పేర్లు కూడా బయటికి వస్తుండటంతో అభిమానుల్లో ఒకింత ఆందోళన మొదలైంది.

    Also Read: రాంచరణ్ నయా లుక్.. ‘అల్లూరి’లా ఒదిగిపోయాడు..!

    డ్రగ్స్ కేసులో తాజాగా శ్రద్ధాకపూర్.. సారా అలీఖాన్.. రకుల్ ప్రీతిసింగ్.. నమ్రతా శిరోద్కర్.. దీపిక పదుకోన్ పేర్లు నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డ్రగ్స్ డీలర్లతో వీరికి సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో తేలడంతో విచారణకు హాజరు కావాల్సింది ఎన్సీబీ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. వీరిని విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు బయటి వచ్చే అవకాశం ఉంది.

    డ్రగ్స్ కేసుతోపాటు తాజాగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎక్కువగా వస్తుండటంతో సినిమా పరిశ్రమపై ప్రతీఒక్కరిలో నెగిటివ్ టాక్ వస్తోంది. ఈ కేసు పూర్తయ్యే నాటికి బాలీవుడ్లోని చీకటి బాగోతాలు మరిన్ని వెలుగుచూడటం ఖాయంగా కన్పిస్తోంది.