స్టార్ హీరో భారీ డిమాండ్.. బాధలో నిర్మాతలు !

నేచురల్ స్టార్ నాని నటించిన క్లాస్ మూవీ ‘జెర్సీ’ హిందీలో అక్కడి స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా భారీ స్థాయిలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి భారీ హిట్ ను సొంతం చేసుకుని, తన మార్కెట్ ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్న షాహిద్ ఈ చిత్రానికి రెమ్యూనరేషన్‌ ను రెట్టింపు చేసినట్టు తెలుస్తుంది. కేవలం తన రెమ్యూనరేషన్‌ గా 45 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని.. […]

Written By: admin, Updated On : September 24, 2020 12:51 pm
Follow us on


నేచురల్ స్టార్ నాని నటించిన క్లాస్ మూవీ ‘జెర్సీ’ హిందీలో అక్కడి స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా భారీ స్థాయిలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి భారీ హిట్ ను సొంతం చేసుకుని, తన మార్కెట్ ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్న షాహిద్ ఈ చిత్రానికి రెమ్యూనరేషన్‌ ను రెట్టింపు చేసినట్టు తెలుస్తుంది. కేవలం తన రెమ్యూనరేషన్‌ గా 45 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని.. కరోనా కాలంలో కూడా షాహిద్ ఇలా అడగడం.. ఏం బాగాలేదని నిర్మాతలు కూడా బాధ పడుతున్నారట. కానీ షాహిద్ మాత్రం నలభై ఐదు కోట్లకు తగ్గితే తనకు గిట్టుబాటు కాదు అంటున్నాడట.

Also Read: బాక్సాఫీస్ వార్.. చిరు వర్సెస్ బాలయ్య?

మొత్తానికి నిర్మాతలు కూడా చేసేది ఏమి లేక షాహిద్ అడిగినంత సమర్పించుకోవడానికి సిద్ధం అయ్యారు. ఇక ఈ సినిమాలో షాహిద్ కి హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. మరి షాహిద్ కపూర్ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో కూడా అమితాశక్తి నెలకొన్న మాట వాస్తవం. పైగా జెర్సీ క్లాసిక్ మూవీ అంటూ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని బాగా ఆదరించారు. మరి అర్జున్ రెడ్డి సినిమాలానే జెర్సీ సినిమా కూడా షాహిద్ కి భారీ విజయాన్ని ఇస్తోందేమో చూడాలి.

Also Read: కరోనాతో నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి

తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే నెల నాలుగో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చండీగఢ్ లో మొదలుకానుందని.. చండీగఢ్ లోని లొకేషన్స్ సినిమాలోని సీన్స్ కి బాగా సూట్ అవుతాయని.. అందుకే కష్టం అయినా అక్కడే షూటింగ్ చేయాలని చిత్రబృందం అక్కడే షూట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నారట, మెయిన్ గా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు.. తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కొనసాగించేలా ముగింపును మార్చరట.