ఓటీటీలో సినిమా ప్లాప్ అయితే డబ్బులు వెనక్కి?

దేశంలో లాక్డౌన్.. కరోనా ఎఫెక్ట్ థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. గత ఆరునెలలు థియేటర్లు మూతపడటంతో ఓటీటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. కరోనాతో అత్యధికంగా లబ్ధిపొందిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అది ఓటీటీనే. థియేటర్లో సినిమాలు చూసే ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటుపడిపోవడంతో ఓటీటీ పరిశ్రమ మూడు పువ్వులు.. ఆరుకాయలుగా మారిపోయింది. చిన్న నిర్మాతలకు ఓటీటీలు వరంగా మారాయి. అయితే భారీ బడ్జెట్లో నిర్మించే సినిమాలకు మాత్రం ఓటీటీలు పనికి రాదనే టాక్ విన్పిస్తోంది. అయితే థియేటర్లు మూతపడటంతో […]

Written By: NARESH, Updated On : September 24, 2020 3:26 pm
Follow us on

దేశంలో లాక్డౌన్.. కరోనా ఎఫెక్ట్ థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. గత ఆరునెలలు థియేటర్లు మూతపడటంతో ఓటీటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. కరోనాతో అత్యధికంగా లబ్ధిపొందిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అది ఓటీటీనే. థియేటర్లో సినిమాలు చూసే ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటుపడిపోవడంతో ఓటీటీ పరిశ్రమ మూడు పువ్వులు.. ఆరుకాయలుగా మారిపోయింది.

చిన్న నిర్మాతలకు ఓటీటీలు వరంగా మారాయి. అయితే భారీ బడ్జెట్లో నిర్మించే సినిమాలకు మాత్రం ఓటీటీలు పనికి రాదనే టాక్ విన్పిస్తోంది. అయితే థియేటర్లు మూతపడటంతో పెద్ద సినిమాలు సైతం ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నారు. టాలీవుడ్లోని అగ్ర నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా పెద్ద సినిమాలు కూడా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి.

ఓటీటీలతో అగ్ర నిర్మాతలు మంచి ధరకు డీల్ కుదుర్చుకొని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లలో సినిమాలు ప్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలపై ఒత్తిడితెచ్చి ఎంతోకొంత వెనక్కి తెప్పించుకునేవారు. అయితే ఓటీటీలో నిర్మాతలకు ఇలాంటి సమస్యలు ఉండవని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓటీటీ నిర్వాహకులు కూడా సినిమా ప్లాప్ అయితే తాము ఇచ్చిన దాంట్లో కొంత వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల టాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాత ఓటీటీతో భారీ డీల్ కుదుర్చుకున్నాడు. ఓ హీరోకు మైలురాయిగా నిలిచే మూవీ కావడంతో సినిమా థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కన్పించకపోవడంతో నిర్మాత సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాతో తమ ఓటీటీకి వ్యూయర్ షిప్ పెరుగుతుందని.. సబ్ స్క్రైబర్స్ పెరుగుతారని ఆశించి భారీ డీల్ కుదుర్చుకుంది.

ఈ సినిమా ఓటీటీ రిలీజయ్యాక సదరు నిర్వాహకులు ఊహించిందేమీ జరుగలేదట. దీనికితోడు ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాను పలు భాషల్లో డబ్బింగ్ చేసినా ఆశించిన స్పందన రాలేదని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా ఓటీటీ రిలీజైన కొద్ది నిమిషాల్లో ఈ మూవీ పైరసీ సైట్స్ లో దర్శనమిచ్చింది. దీంతో సదరు ఓటీటీ తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది.

దీంతో ఓటీటీ నిర్వాహకులు తమతో ఫ్యూచర్లో మంచి సంబంధాలు ఉండాలంటే తాము ఇచ్చిన సొమ్ముతో కొంత వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. సదరు నిర్మాతపై ఓటీటీ నిర్వాహాకులు ఒత్తిడి తెస్తుండంతో ఏం చేయాలో తెలియక నిర్మాత తలపట్టుకుంటున్నాడనే టాక్ విన్పిస్తోంది. ఓటీటీలు సైతం డిస్ట్రిబ్యూటర్ల మాదిరిగానే వ్యవహరిస్తుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.