CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమై దూసుకుపోతున్న బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పీడ్‌కు సర్వే రిపోర్టులు బ్రేక్ వేస్తున్నాయి. ఇప్పటికే ఏడు నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించిన గులాబీ బాస్.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ప్రసంగాం ఏమీ చేయలేదు. పాడిందే పాటరా అన్నట్లు.. పాత ప్రసంగాన్నే వల్లె వేస్తున్నారన్న అభిప్రాయం బీఆర్‌ఎస్‌లోనే వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రచారానికి స్పందన కూడా పెద్దగా రావడం లేదు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ నియోజకవర్గంలోనూ సభకు డబ్బులు ఇచ్చి ప్రజలను రప్పించుకోవాల్సిన పరిస్థితి రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈనెల 26 నుంచి నిర్వహించే ఎన్నికల సభల్లో కేసీఆర్ స్ట్రాటజీ మార్చనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు పాల్గొన్న పబ్లిక్ మీటింగ్స్‌లో అనుకున్నంత మేర మైలేజ్ రాలేదని సర్వే రిపోర్టులో తేలినట్టు టాక్. దీంతో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసేందుకు, పొలిటికల్ మైలేజ్ పొందేందుకు ఆ పార్టీపై విమర్శలు పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు టాక్. దీంతో తదుపరి సభల్లో మరింత దూకుడుకు ప్లాన్, కాంగ్రెస్‌పై విమర్శలు పెంచాలని నిర్ణయించారు.
దూకుడు పెంచేలా..
ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 26 నుంచి జరిగే బహిరంగ సభల్లో తన సహజశైలిలో కాంగ్రెస్‌పై ఎదురు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు పాల్గొన్న పబ్లిక్ మీటింగ్‌లలో ఇంతకాలం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే పాతవాటిని కొనసాగిస్తూ, కొత్త వాటిని సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇస్తూ మాట్లాడారు. కానీ ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదనే అభిప్రాయాలు పార్టీ లీడర్లలో ఉన్నాయి.
ఎటాకింగ్ పాలిటిక్స్..
మొదటి దశలో అనుకున్న మేర మైలేజీ రాలేదని సర్వే రిపోర్టుల్లో తేలినట్టు టాక్ ఉంది. దీంతో ఇక నుంచి కేసీఆర్ దూకుడు పెంచుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి. తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ లీడర్లు వ్యవహరిం చిన తీరును మరింతగా ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
వర్కవుట్ కాని స్కీమ్స్
ఈనెల 15 నుంచి 18 వరకు సీఎం కేసీఆర్ 7 పబ్లిక్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. మళ్లీ అధి కారంలోకి వస్తే గృహలక్ష్మి ఏం చేస్తామో.. వివరించేందుకు ఆయన ఎక్కువ సమయం కేటాయించారు. అయితే పథకాలపై ప్రజల్లో పాజిటì వ్ ఒపీనియన్ ఏర్పడలేదని టాక్. ప్రస్తుతం అమలవుతున్న పలు స్కీ మ్స్ కోతలు పెట్టారు. మూడేళ్లుగా 57 ఏళ్లు నిండిన వృద్ధులకు ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దళితబంధు, గృహలక్ష్మి, బీసీ సాయం కింద కేవలం లబ్ధిదారులను మాత్రమే గుర్తించారు. వారంతా తమకు చెక్కులు ఎప్పుడిస్తారని నిలదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పథకాల గురించి చెప్పడం వల్ల పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ అవుతుందని అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో కేసీఆర్ తన స్ట్రాటజీని మార్చనున్నట్లు తెలుస్తోంది.