తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగే ఏ విషయంలోనైనా కేసీఆర్ వెనక్కి తగ్గరు. అదే ఏపీలో జగన్ మాత్రం బెండ్ అవుతున్నారు. తెలంగాణలో ఉచిత విద్యుత్ అమలవుతున్న వేళ కేంద్రం మీటర్లు పెట్టమంటే కేసీఆర్ నో చెప్పారు. జగన్ ఎస్ చెప్పి అమలు చేస్తూ అమలు చేస్తున్నారు.
Also Read: రెవెన్యూ రచ్చ.. అసెంబ్లీని కుదిపేసింది!
ఇక తెలంగాణలో ఆరోగ్య శ్రీ అమలవుతోంది. కానీ కేంద్రంలోని ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని బీజేపీ సర్కార్ ఒత్తిడి తెస్తున్నా.. కేసీఆర్ ఒప్పుకోవడం లేదు. అదో బక్వాస్ పథకం అని చాలా సార్లు తిట్టిపోశారు. రెండు రోజుల కింద అసెంబ్లీలో ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ నిండు సభలో ఆయుష్మాన్ భారత్ పథకంపై నోరుపారేసుకున్నారు. దానికంటే మన ‘ఆరోగ్యశ్రీ’ నయం అంటూ ఉదాహరణలతో కేంద్రం పథకాన్ని ఎండగట్టారు. కేంద్రం పథకం దండగ అని.. పనికిరాదంటూ ఎద్దేవా చేశారు.
అయితే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎన్డీఏ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. తక్కువ ప్రీమియం చెల్లింపుతో వైద్య సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు కావడం లేదు. ఈ పథకం అమలు చేసే హక్కు రాష్ట్రాలకే ఉందనే కారణంతో తెలంగాణ సర్కార్ అమలు చేయడం లేదు.
ఈ క్రమంలోనే కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా అమలు కావడం లేదని పిటీషన్ వేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం అందక ఆ రాష్ట్రాల ప్రజలు నష్టపోతున్నారని వాదించారు. దీంతో విచారణ అనంతరం ఆయా రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
Also Read: రగిలిన ‘విమోచనం’.. కేసీఆర్ ఎందుకు నిర్వహించరు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. నోటీసులు జారీ చేసింది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంపై ఈ నోటీసులు జారీ చేసింది. తెలంగాణతోపాటు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు.
నిజానికి ఆయుష్మాన్ భారత్ లో చికిత్సలకు లిమిట్ ఉంది. కొన్నింటికే చికిత్స చేసుకోవచ్చు. అదే ఆరోగ్య శ్రీలో సర్వం ఫ్రీ. 2 లక్షల వరకు వైద్యం చేసుకోవచ్చు. అందుకే కేసీఆర్ వద్దంటున్నారు. మరి దీనిపై కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది వేచిచూడాలి.