https://oktelugu.com/

Kolkata Doctor Case: కోల్ కతా డాక్టర్ కేసుపై సుప్రీంకోర్టు సంచలనం.. ఈ రోజు అప్ డేట్స్ ఇవే..

ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం (ఆగస్ట్ 20) రోజున ఈ కేసును విచారించనుంది.

Written By: , Updated On : August 18, 2024 / 05:54 PM IST
Kolkata Docctor Case

Kolkata Docctor Case

Follow us on

Kolkata Doctor Case : దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ‌కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఒక మహిళా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైగికదాడి, హత్యకేసులో న్యాయం చేయాలంటూ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి దేశం యావత్తు కదిలింది. దేశంలో ప్రతీ మూల వైద్యులు, ఆర్ఎంపీలతో సహా అందరూ రోడ్లెక్కారు. నిరసనలు, రాస్తారోకోలు చేశారు. కొన్ని చోట్ల బెంగాళ్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయిని నినదించారు. ఈ ఘటన నిర్భయను గుర్తు చేస్తుందని వైద్యులు ఆందోళన చెందారు. ప్రతిపక్ష నాయకులు వీరికి మద్దతివ్వగా.. పౌరులు వీధుల్లోకి వచ్చారు. కాగా, ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం (ఆగస్ట్ 20) రోజున ఈ కేసును విచారించనుంది. మరోవైపు హాస్పిటల్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, ఇప్పటి వరకు జరిగిన విచారణతో కుటుంబం సంతృప్తి చెందలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. మహిళా వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసులో వరుసగా మూడో రోజు విచారణకు హాజరుకావాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జీకర్ మెడికల్ అండ్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సీబీఐ అధికారులు కోరారు.

కేసుకు సంబంధించి తాజా అప్ డేట్స్ ఇలా ఉన్నాయి..

16:33
18 ఆగస్ట్ 2024
ఈ కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది.

16:06
18 ఆగస్ట్ 2024
కోల్ కత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో సీబీఐ బృందం 3డీ లేజర్ మ్యాపింగ్ నిర్వహించింది.

16:01
18 ఆగస్ట్ 2024
‘మొత్తం డిపార్ట్ మెంట్ ప్రమేయం ఉంది’: అడ్మిన్ పై బాధితురాలి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు.

14:30
18 ఆగస్ట్ 2024
టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కు కోల్ కత్తా పోలీసులు సమన్లు జారీ చేశారు.

08:27
18 ఆగస్ట్ 2024
నిందితుల మానసిక పరిస్థితిపై తెలుసుకోనున్న చేయనున్న సీబీఐ.

16:33
18 ఆగస్ట్ 2024
ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
కోల్ కత్తాలోని ఆర్జీ కర్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ విచారణ జరపనుంది.

16:29
18 ఆగష్టు 2024
రాజకీయాలు దురదృష్టకరం, న్యాయానికి పెద్దపీట వేయాలి: కాంగ్రెస్ నేత టీఎస్ సింగ్ దేవ్

16:06
18 ఆగస్ట్ 2024
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో సీబీఐ బృందం 3డీ లేజర్ మ్యాపింగ్ నిర్వహించింది.

 

16:01
18 ఆగస్ట్ 2024
‘మొత్తం డిపార్ట్ మెంట్ ప్రమేయం ఉంది’: అడ్మిన్ పై బాధితురాలి తండ్రి సంచలన ఆరోపణలు

ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేప్-డెత్ కేసులో మరణించిన వైద్యుడి తండ్రి ఆదివారం (ఆగస్ట్ 18) హాస్పిటల్ నిర్వహణపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు జరుగుతున్న విచారణతో తాను సంతృప్తి చెందలేదని ఆయన పేర్కొన్నారు. జరుగుతున్న విచారణతో న్యాయం జరగడం లేదన్నారు. కోర్టు ప్రమేయంతోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. డిపార్ట్ మెంట్ నుంచి కానీ, కాలేజీ నుంచి కానీ ఎవరూ మాకు సహకరించడం లేదు. ఇందులో డిపార్ట్ మెంట్ పాత్ర కూడా ఉంది’ అని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

సీఎం మమతా బెనర్జీ స్వయంగా నిరసన తెలుపుతుంటే, బాధితురాలికి న్యాయం చేయాలంటూ ర్యాలీలు నిర్వహిస్తున్న సామాన్యులను ప్రభుత్వం జైలులో పెడుతోందన్నారు.

శ్మశాన వాటికలో మూడు మృత దేహాలు ఉన్నాయని, అయితే తమ కుమార్తె మృతదేహానికి తొలుత దహన సంస్కారాలు నిర్వహించామని చెప్పారు. న్యాయం చేస్తామని సీఎం మాట్లాడుతున్నారని, కానీ న్యాయం కోరుతున్న సామాన్యులను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంపై సంతృప్తిగా లేమన్నారు. నష్టపరిహారం ఇస్తామంటే.. తమకు న్యాయం చేస్తే చాలని నష్టపరిహారం తీసుకునేందుకు నిరాకరించామని తెలిపారు.

 

15:35
18 ఆగష్టు 2024
ప్రతి ఒక్కరినీ బాధపెట్టే సంఘటనలు జరగకూడదు: గాయకుడు ఉదిత్ నారాయణ్