https://oktelugu.com/

Arshad Warsi: ప్రభాస్ ఒక జోకర్ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..మండిపడుతున్న ఫ్యాన్స్!

క్వాలిటీ సినిమాలు వేగంగా చెయ్యడంలో, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టడం లో ప్రభాస్ ఒక ఆర్టిస్ట్ అంటే అతిశయోక్తి కాదేమో. ఆయన ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్, ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమా కలెక్షన్స్ తో సమానంగా ఉంటున్నాయి. ఈ స్థాయి డామినేషన్ అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే చేసేవాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 18, 2024 / 05:55 PM IST

    Arshad Warsi

    Follow us on

    Arshad Warsi: పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం మన ప్రభాస్ కి మించిన సూపర్ స్టార్ ఎవ్వరూ లేరు, ఇది కాదు అనలేని సత్యం. క్వాలిటీ సినిమాలు వేగంగా చెయ్యడంలో, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టడం లో ప్రభాస్ ఒక ఆర్టిస్ట్ అంటే అతిశయోక్తి కాదేమో. ఆయన ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్, ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమా కలెక్షన్స్ తో సమానంగా ఉంటున్నాయి. ఈ స్థాయి డామినేషన్ అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే చేసేవాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. కానీ ప్రభాస్ బాలీవుడ్ లో కూడా ఇదే తరహా ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇది అక్కడి స్టార్ హీరోలకు ఏమాత్రం నచ్చడం లేదు. మొదటి నుండి సౌత్ ఇండియన్ సినీ నటులు, డైరెక్టర్స్ అంటే బాలీవుడ్ వారికి చిన్న చూపు.

    ఇది కాదు అనలేని నిజం. అలాంటిది ఒక తెలుగు హీరో బాలీవుడ్ రికార్డ్స్ ఎగరేసి కొడుతుంటే అసూయ ఉండకుండా ఎలా ఉంటుంది..?, కచ్చితంగా ఉంటుంది. కొంతమంది నటులు అయితే ప్రభాస్ ని నేరుగా దుర్భాషలు ఆడడం ఇటీవల కొన్ని సందర్భాల్లో చూస్తున్నాము. ఒక నటుడు అయితే ఒక అడుగు ముందుకేసి ప్రభాస్ ఒక జోకర్ అంటూ కామెంట్స్ చేసాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అర్షద్ వార్సీ అనే ప్రముఖ బాలీవుడ్ నటుడు రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన ‘కల్కి’ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ఇందులో డైరెక్టర్ ప్రభాస్ ని జోకర్ లాగ చూపించాడు. ఇది అమితాబ్ బచ్చన్ సినిమా లాగ అనిపించింది’ అంటూ కామెంట్స్ చేసాడు. దీనిపై ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ కి సంబంధించిన ఇతర హీరోల అభిమానులు కూడా చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు బాలీవుడ్ కంటే పదింతలు పెరిగేలోపు అక్కడి నటీనటులు, దర్శక నిర్మాతలు చూసి ఓర్వలేకపోతున్నారని, దుమ్ముంటే తెలుగు సినిమాతో పోటీ పడి క్వాలిటీ సినిమాలు నిర్మించమని, చేతకాకపోతే మేము తీసే సినిమాలు చూసి బ్రతకండి అంటూ టాలీవుడ్ అభిమానులు బాలీవుడ్ కి కౌంటర్లు ఇస్తున్నారు.

    త్వరలో మా టాలీవుడ్ హీరోలే బాలీవుడ్ నెంబర్ 1 స్థానం లో కూర్చుంటారు, మా టాలీవుడ్ హీరోల సినిమాల్లో మీ బాలీవుడ్ సూపర్ స్టార్స్ కి క్యారక్టర్ రోల్స్ ఇస్తాము అంటూ బాలీవుడ్ నటీనటులను ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ ని జోకర్ ని సంబోధించిన అర్షద్ మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ లోని ఏటీఎం క్యారక్టర్ ని బాలీవుడ్ లో ‘మున్నా భాయ్ ఎంబీబీఎస్’ లో చేసాడు. ఒక్కసారి శ్రీకాంత్ నటనకి, ఇతని నటనకి వ్యత్యాసం చూస్తే ఎంత చెత్తగా చేసాడో అర్థం అవుతుంది. అలాంటి నటుడు ఈరోజు ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ పై కామెంట్స్ చెయ్యడం నిజంగా హాస్యాస్పదం.