Homeజాతీయ వార్తలుకేంద్రంపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్‌‌ : చట్టాలను నిలిపివేస్తారా.. లేదా..?

కేంద్రంపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్‌‌ : చట్టాలను నిలిపివేస్తారా.. లేదా..?

Farm Laws
కేంద్రం తీసుకొచ్చిన అగ్రి చట్టాలపై రైతులు చేపట్టిన ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. రైతులు బెట్టు వీడడం లేదు. కేంద్రం మెట్టు దిగడం లేదు అన్నట్లుగా నడుస్తోంది. ఇప్పటికే ఎనిమిది సార్లు రైతులు, రైతు సంఘాలతో చర్చలు నిర్వహించినా ఏం కొలిక్కి రాలేదు. అంతేకాదు.. రైతులు రోజురోజుకూ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. అటు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలికి తోడు వరుణుడి పరీక్ష కూడా తోడైంది. అయినా.. రైతులు దేనికీ వెరవకుండా చలిని, వర్షాన్ని తట్టుకొని పోరాటం సాగిస్తున్నారు.

తాజాగా.. ఈ విషయంపై అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం చర్యలతో తాము నిరాశతో ఉన్నామని సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు నేడు విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చట్టాల అమలును కొంత కాలం నలిపివేస్తారా లేదా కోర్టునే ఆ పనిచేయమంటారా..? అని కేంద్రాన్ని ప్రశ్నించింది.

Also Read: మరో రాష్ట్రంలో కూల్చివేతకు బీజేపీ రె‘ఢీ’!

‘సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య జరుగుతున్న ప్రక్రియపై అసంతృప్తిగా ఉన్నాం. అసలు చర్చల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆందోళనల్లో పాల్గొన్న కొంత మంది రైతులు ఆత్మహత్మ కూడా చేసుకున్నారు. మహిలలు, వృద్ధులు కూడా ఆందోళనలో ఉన్నారు. అసలేం జరుగుతోంది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మా చేతులను రక్తం అంటుకోవాలని మేం కోరుకోవట్లేదు’ అని సీజేఐ కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు.

Also Read: సిడ్నీ టెస్ట్: గోడకట్టిన అశ్విన్, విహారి.. ఛాన్స్ మిస్ చేసిన టీమిండియా

అలా ఫైర్‌‌ అవుతూనే పలు సూచనలు కూడా చేసింది. చట్టాలను రద్దు చేయాలని తాము చెప్పడం లేదని.. సమస్యకు పరిష్కారం కనుగొనడమే తమ లక్ష్యమని పేర్కొంది. చట్టాలను కొంతకాలం నిలిపివేయగలరా అని ప్రశ్నించింది. చట్టాలు ప్రయోజకరమేనని చెప్పేందుకు ఏమీ కనిపించడం లేదని అభిప్రాయపడింది. సమస్య పరిష్కారానికి కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీ తన నివేదిక ఇచ్చేవరకు వ్యవసాయ చట్టాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఉన్నామని ధర్మాసనం వెల్లడించింది. అంతేకాదు.. రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగించుకోవచ్చని అభిప్రాయపడింది. అయితే.. ఆందోళనను మరోచోటుకు మార్చుకునే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

సీజేఐ వ్యాఖ్యలతో.. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. చట్టాలను నిలిపివేయడం కుదరదని, దీనిపై సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప చట్టాన్ని నిలిపివేసే హక్కు కోర్టుకు లేదని చెప్పారు. కొత్త చట్టాలపై యావత్‌ దేశం సంతృప్తిగానే ఉందని, కేవలం రెండు, మూడు రాష్ట్రాలు మాత్రమే ఆందోళనలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version