https://oktelugu.com/

ప్రభుత్వాన్ని వదిలి.. మేఘా గూటికి..

పీవీ రమేష్‌.. ఏపీ ప్రభుత్వ సలహా. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశ్వాసం కోల్పోయిన పీవీ రమేష్‌.. ఇప్పుడు మేఘా కంపెనీ గూటికి చేరారు. ఆయన మేఘా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థకు ఎండీగా ఉద్యోగం సంపాదించారు. కన్‌స్ట్రక్షన్ రంగలో ఉన్న మేఘా సంస్థ.. తన వ్యాపార స్వభావానికి భిన్నమైన రంగంలో పట్టు సాధించాలన్న లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సుల రంగంలోకి వచ్చింది. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 11, 2021 / 01:38 PM IST
    Follow us on


    పీవీ రమేష్‌.. ఏపీ ప్రభుత్వ సలహా. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశ్వాసం కోల్పోయిన పీవీ రమేష్‌.. ఇప్పుడు మేఘా కంపెనీ గూటికి చేరారు. ఆయన మేఘా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థకు ఎండీగా ఉద్యోగం సంపాదించారు. కన్‌స్ట్రక్షన్ రంగలో ఉన్న మేఘా సంస్థ.. తన వ్యాపార స్వభావానికి భిన్నమైన రంగంలో పట్టు సాధించాలన్న లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సుల రంగంలోకి వచ్చింది.

    Also Read: పవన్‌ బాగానే పరిణతి సాధించారే..! : అందుకే బీజేపీని ఇన్‌వాల్వ్‌ చేయడం లేదా..?

    కన్‌స్ట్రక్షన్ కార్యకలాపాల్లో చురుకుగా ఉండే మేఘా కృష్ణారెడ్డి కొన్నాళ్ల కిందట ఎలక్ట్రిక్ బస్సుల వ్యాపారంలోకి వచ్చారు. ఓ చైనా సంస్థను కొని.. బస్సుల ఉత్పత్తి ప్రారంభించారు. దేశంలో టాటా, అశోక్ లేలాండ్, ఐషర్ లాంటి కంపెనీలతో పోల్చితే.. ఒలెక్ట్రా చాలా చిన్నదే. అయినా తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో బస్సులు నడిపే కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. విజయవంతంగా నడుపుతోంది. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని మార్కెట్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఇలాంటి సమయంలో ఒలెక్ట్రాపై మరింత దృష్టి పెట్టాలని మేఘా సంస్థ నిర్ణయించుకుంది.

    Also Read: వ్యక్తిగత వైరాలకు వ్యవస్థలు బలి..ఆంధ్రా పరువు నడిబజారున!

    అందుకే ఐఏఎస్ అధికారిగా సమర్థవంతంగా సేవలు అందించిన పీవీ రమేష్‌ను నియమించి సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని మేఘా యజమానులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రిటైరైన ఐఏఎస్ అధికారులు ఎక్కువగా ప్రైవేటు సంస్థల్లో కీలక స్థానాల్లో చేరుతూ ఉంటారు. పీవీ రమేష్ కూడా అదే చాయిస్ ఎంచుకున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    అయితే.. రమేష్‌ తన పదవికి రాజీనామా చేయడంతో సీఎం జగన్‌ కూడా ఆల్‌దిబెస్ట్ చెప్పారని టాక్‌. మొత్తానికి ప్రభుత్వ కీలక బాధ్యతలు వదిలి ప్రైవేటు కంపెనీలోకి దూరిపోవడం చర్చనీయాంశమైంది. రమేష్‌ వైఖరి నచ్చక ఇప్పటికే ప్రభుత్వం ఆయనకు అప్పగించిన శాఖలన్నింటినీ తొలగించింది. తనను కావాలనే ప్రభుత్వం ఇలా చేసినట్లు రమేష్‌ ఆరోపణలు సైతం చేశారు. చివరకు ఆయనకు ఆయనే తప్పకునేలా చేశారు.