బీజేపీతో మిగిలేది ఎవ్వరు?

కేంద్రంలోని బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న చట్టాలపై అటు పార్టీలు.. ఇటు ప్రజలు భగ్గుమంటున్నారు. మిత్రపక్షంలో నుంచే వ్యతిరేకత వస్తుండడంతో ఒక్కొక్కరుగా తమ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటివరకు స్ట్రాంగ్‌ కూటమిగా ఉన్న ఎన్డీయే రోజురోజుకూ బలహీనపడుతోంది. ఇప్పటికే ఎన్టీయే నుంచి శివసేన, అకాలీదళ్‌ వైదొలిగాయి. దీనిపై శివసేన పార్టీ పత్రిక అయిన ‘సామ్నా’ సోమవారం కీలక విమర్శలు చేసింది. రైతు బిల్లులపై ఎన్డీయే నుంచి అకాలీదళ్ వైదొలగడాన్ని ‘సామ్నా’ సంపాదకీయం ప్రస్తావిస్తూ, ఇంకా బీజేపీ […]

Written By: NARESH, Updated On : September 28, 2020 3:03 pm
Follow us on

కేంద్రంలోని బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న చట్టాలపై అటు పార్టీలు.. ఇటు ప్రజలు భగ్గుమంటున్నారు. మిత్రపక్షంలో నుంచే వ్యతిరేకత వస్తుండడంతో ఒక్కొక్కరుగా తమ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటివరకు స్ట్రాంగ్‌ కూటమిగా ఉన్న ఎన్డీయే రోజురోజుకూ బలహీనపడుతోంది. ఇప్పటికే ఎన్టీయే నుంచి శివసేన, అకాలీదళ్‌ వైదొలిగాయి. దీనిపై శివసేన పార్టీ పత్రిక అయిన ‘సామ్నా’ సోమవారం కీలక విమర్శలు చేసింది.

రైతు బిల్లులపై ఎన్డీయే నుంచి అకాలీదళ్ వైదొలగడాన్ని ‘సామ్నా’ సంపాదకీయం ప్రస్తావిస్తూ, ఇంకా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు ఉనికి ఉందా? కూటమిలో ఇప్పుడు ఎవరు మిగిలారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘ఎన్డీయే చిట్టచివరి స్తంభమైన అకాలీదళ్‌ మైత్రీ బంధాన్ని తెంచుకుంటుంటే ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యకరం. బాదల్ తప్పుకున్నప్పుడు ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. దీనికి ముందు, ఎన్డీయే నుంచి శివసేన తప్పుకుంది. ఈ రెండు పార్టీలు తప్పుకోవడంతో ఎన్డీయేలో ఇంకేమి మిగిలింది? ఇప్పటికీ ఎవరైనా ఉంటే హిందుత్వం గురించి వారు చేసిందేముంది?’ అని ఆ సంపాదకీయంలో నిలదీసింది.

ధైర్య సాహసాలకు పంజాబ్, మహారాష్ట్ర ప్రతీకలని, పురుషత్వానికి రెండు ముఖాలే అకాలీదళ్‌, శివసేన అని పేర్కొంది. ఎన్డీయే రెండు సింహాలను కోల్పోయిందని వ్యాఖ్యానించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు దీటైన కూటమి కోసం ఎన్డీయే ఏర్పాటు జరిగిందని, ఏళ్ల తరబడి ఎన్నో ఆటుపోట్లను చవిచూసిందని, అనేక పార్టీలు అంతరాత్మ ప్రబోధం మేరకు ఎన్డీయే నుంచి తప్పుకున్నాయని సామ్నా సంపాదకీయం తెలిపింది.

దేశ రాజకీయాల్లో ఏక పార్టీ వ్యవస్థను దూరం చేయాలనుకుంటే, బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిందని వివరించింది. మహారాష్ట్రలో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వం చక్కటి పాలన అందిస్తోందని, ఐదేళ్లు కచ్చితంగా అధికారంలో ఉంటుందని సామ్నా కుండబద్దలు కొట్టింది.