https://oktelugu.com/

అన్ లాక్ 5.0: సినిమా హాళ్లు తెరుచుకోబోతున్నాయ్‌..?

కరోనా కట్టడిలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ అమలు చేసిన కేంద్రం ఇప్పుడు విడతల వారీగా అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుపెట్టింది. ఒక్కో నెల ఆయా రంగాలకు కేంద్రం పర్మిషన్‌ ఇస్తూ వస్తోంది. ఈనెలతో 30తో అన్‌లాక్‌ 4.0 ముగియనుంది. అక్టోబర్‌‌ 1 నుంచి అన్‌లాక్‌ 5.0 మొదలు కానుంది. ఈ అన్‌లాక్‌లో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏడు నెలలుగా మూసివేసిన సినిమా థియేటర్లు, పర్యాటక ప్రాంతాలకు అనుమతించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. Also Read : […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2020 / 04:00 PM IST

    cinema

    Follow us on


    కరోనా కట్టడిలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ అమలు చేసిన కేంద్రం ఇప్పుడు విడతల వారీగా అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుపెట్టింది. ఒక్కో నెల ఆయా రంగాలకు కేంద్రం పర్మిషన్‌ ఇస్తూ వస్తోంది. ఈనెలతో 30తో అన్‌లాక్‌ 4.0 ముగియనుంది. అక్టోబర్‌‌ 1 నుంచి అన్‌లాక్‌ 5.0 మొదలు కానుంది. ఈ అన్‌లాక్‌లో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏడు నెలలుగా మూసివేసిన సినిమా థియేటర్లు, పర్యాటక ప్రాంతాలకు అనుమతించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

    Also Read : బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సోనుసూద్‌

    వైరస్‌ ఉధృతి ఉన్నా.. అంత సీరియస్‌నెస్‌ లేకపోవడంతో కేంద్రం ఒక్కో వెసులుబాటు ఇస్తూ వస్తోంది. గతంతో పోలిస్తే ఈ అన్‌లాక్‌ 5.0లో మరిన్ని సండలింపులు ఇస్తున్నట్లు సమాచారం. ఇటీవల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇదివరకు ఉన్న కంటైన్మెంట్ జోన్ల స్థానంలో మైక్రో-కంటెయిన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్వల్ప కాలం లాక్ డౌన్, కర్ఫ్యూ విధించాలని సీఎంలకు సూచించారు.

    ఈ అక్టోబర్‌‌ నెల మొత్తం దేశంలో పండుగ వాతావరణం ఉంటుంది. ఈనెలనే అన్‌లాక్‌ 5.0 ప్రారంభం కాబోతోంది. ముఖ్య పండగలైన దసరా, దీపావళి ఈ నెలలోనే జరుపుకోనున్నారు. తర్వాత క్రిస్మస్ కూడా ఉంది. ఈ క్రమంలో మరిన్ని నిబంధనలను సడలించాలని భావిస్తోంది. ప్రజల యాక్టివిటీ పెంచడంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు సినిమా హాల్స్ తిరిగి తెరచుకోవచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బార్లు, క్లబ్బులు ఇప్పటికే తెరుచుకున్నాయి. అక్టోబర్ 1 నుంచి సినిమా హాల్స్ తెరచుకోవచ్చని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది కూడా. 50 శాతం కన్నా తక్కువ మంది ప్రేక్షకులతో సినిమాలను ప్రదర్శించుకునేందుకు అన్‌లాక్ 5.0లో అనుమతి లభించనుంది. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖకు సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖారే లేఖ కూడా రాశారు.

    మరోవైపు పర్యాటక శాఖకు సడలింపులు లభించే అవకాశం ఉంది. పర్యాటకులకు స్వాగతం పలికేలా అన్ని టూరిజం స్పాట్లు తెరచుకునే ఛాన్స్ ఉంది. ఉత్తరాఖండ్ ఇప్పటికే టూరిస్టులను స్వాగతించింది. కరోనా రిపోర్టు, క్వారంటైన్ లేకుండానే రాష్ట్రానికి పర్యాటకులు వచ్చి పోవచ్చని స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి విద్యా సంస్థలకు కూడా మరిన్ని సడలింపులు ఉండనున్నాయి. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేస్తుందని విశ్వసనీయంగా తెలిసింది.

    Also Read : బ్రేకింగ్ : భక్తుడితో  పవన్ కొత్త సినిమా !