
Sukesh Chandrasekhar: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొత్తకోణం వెలుగు చూసింది. ఆర్థిక నేరగాడు సంచలన విషయాలు లేఖ ద్వారా వెల్లడించడంతో భారత రాష్ట్ర సమితిలో ప్రకంపనలు మొదలయ్యాయి.. ఇప్పటిదాకా మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సౌత్ గ్రూపులు ఇచ్చింది అనేది దర్యాప్తు సంస్థల ప్రధాన ఆరోపణ. అని దానికి భిన్నంగా 2020 అరవింద్ కేజ్రీ వాలే తన ద్వారా హైదరాబాదులోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి 15 కోట్లు చేరవేశారంటూ మనీ లాండరింగ్ కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు తన చేతి రాతతో లేఖను తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా విడుదల చేసి సంచలనం సృష్టించాడు.
” అరవింద్.. ఇవన్నీ పచ్చి నాటకాలు.. పచ్చి అవినీతి మానసత్వం నీది. నీ అబద్దాలను, మోసకారితనాన్ని ప్రజల ముందు బయట పెడతా” అంటూ చంద్రశేఖర్ హెచ్చరించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రితో తాను జరిపిన 700 పేజీల వాట్సప్, టెలీ గ్రామ్ చాటింగ్ లను బయట పెడతా” అంటూ సుఖేష్ అరవింద్ ను హెచ్చరించాడు. “హైదరాబాదుకు 15 కిలోల నెయ్యి ( నువ్వు, సత్యేంద్ర జైన్ కలిసి నిర్ణయించిన కోడ్ భాషలో 15 కోట్లు) నా ద్వారా చేరవేయాలని మీరంతా అనుకున్నారు. అప్పటికే హైదరాబాదులో 15 కిలోల చొప్పున 5 కేసుల నెయ్యి ఉందని మీరే చెప్పారు. అందులో ఒక కేసును హైదరాబాద్ టిఆర్ఎస్ కార్యాలయంలో పార్కు చేసి ఉన్న 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కార్ లో ఉన్న “ఏపీ” అనే వ్యక్తికి అందజేయాలని సూచించారు” అని సుఖేష్ చంద్రశేఖర్ ఆలేఖలో వివరించాడు.. అయితే ఈ లేఖను టీజర్ గా మాత్రమే పేర్కొన్న సుఖేష్.. త్వరలో తాను అరవింద్ , సత్యేంద్ర జైన్ తో జరిపిన సంభాషణ మొత్తాన్ని బయటపెడతానని, ఆ ట్రైలర్ చూసి సిగ్గుతో కేజ్రీ వాళ్ళు ముఖం తెల్ల కుండా పోతుందని సుకేష్ హెచ్చరించాడు.

” సోదరా.. నీ కౌంట్ డౌన్ మొదలైంది. నా కుటుంబాన్ని వేధించడం ఆపు. నీకు చెప్పడం ఇదే చివరిసారి. నీ అధికార సింహాసనాన్ని అదిరిపోయేలా నేను చేస్తాను. గోల్మాల్ వ్యవహారాలు మొత్తం బయట పెడతా. నీ అవినీతిని మొత్తం బట్టబయలు చేస్తా.. ఒక సలహా ఇస్తున్నాను.. అరవింద్ నీ నకిలీ ముఖాన్ని ప్రజలకు చూపించకు.. అది నీ కళ్ళలోనే కనిపిస్తోంది. నువ్వు త్వరలో తీహార్ జైలుకు చేరుతావు. కొత్త ముగిసాయి. కర్ణాటక అసెంబ్లీలో నువ్వు ఒక జో కర్ గా మిగిలిపోతావు” అంటూ సుకేష్
ధ్వజమెత్తాడు. చివరిలో జై శ్రీరామ్ అంటూ సంబోధిస్తూ.. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే ఈ లేఖలో తన పేరు స్పెల్లింగ్ ను సుఖష్ చంద్రశేఖర్ గా తప్పుగా రాసుకోవడం గమనార్హం.. చంద్రశేఖర్ ప్రస్తావించిన “ఏపి” అనే వ్యక్తి.. మద్యం కుంభకోణంలో అరుణ్ పిళ్లై ఒక్కరే. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు తాను బినామీ అని ఈడి అధికారుల ఎదుట ఒప్పుకున్న అరుణ్ పిళ్లై.. తన ప్రకటనను ఉపసంహరించుకున్నట్టు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అసలే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇరుకున పడిన భారత రాష్ట్ర సమితికి.. సుఖేశ్ చంద్రశేఖర్ పేల్చిన బాంబు మరింత ఇబ్బంది పెడుతోంది.