Prices In Pakistan: పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. నిత్యావసర సరుకులు పేదలకు అందకుండా పోతన్నాయనే వాదన వినిపిస్తోంది. పెట్రోల్ రూ.150, పంచదార కిలో రూ.150, పిజ్జా రూ.400, కాఫీ రూ.200కు చేరిందంటే అక్కడి పరిస్థితి తెలిసిపోతోంది. ఇలా ధరలు పెరిగితే ఎలా అని సామాన్యుడు సతమతమవుతున్నాడు. ఏం కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలపై ఆందోళన నెలకొంది.
Also Read: ఢిల్లీకి కేసీఆర్.. తేల్చుకునే వస్తామని సవాల్
ద్రవ్యోల్బణం వల్ల పేదల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి నెలకొందని పలువురు వాదిస్తున్నారు. గత డెబ్బయి ఏళ్లలో కనిపించని పరిస్థితి ఇప్పుడు వచ్చిందని ది న్యూస్ నివేదిక వెల్లడించింది. మరోవైపు పాకిస్తాన్ లో మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయి. అయినా అక్కడి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా వారు కూడా భయపడటం లేదు.
ధరల పెరుగుదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. పాకిస్తాన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎఫ్ బీఎస్) ప్రకారం ధరల పెరుగుదల ప్రమాదకర స్థాయికి చేరడం ఆందోళనకరమే అని తెలుస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పైకే వెళుతున్నాయి. దీంతో సామాన్యుడి పరిస్థితి అధ్వానంగా మారుతోంది.
అక్టోబర్ 2018 నుంచి 2021 మధ్య కాలంలో ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ధరల పెరుగుదల అన్నింటిపై ప్రభావం చూపుతూనే ఉంది. కొనేందుకు చేతులు రావడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ధరలు పెరుగుతున్నాయని సామాన్యుడి వాదన. అయినా ప్రజల బాధలు పట్టకుండా ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతోనే ఈ పరిస్థితి దాపురించిందని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరల పెరుగుదలపై దృష్టి సారించి ప్రజల బాధలు తీర్చాలని కోరుతున్నారు.
Also Read: ఇలాంటివారు వ్యాక్సిన్ అవసరం లేకున్నా కరోనాను ఎదుర్కొంటారా..?