https://oktelugu.com/

Allu Arha: అర్హ పుట్టిన రోజుకు అల్లు ఫ్యామిలీ స్పెషల్ గిఫ్ట్​.. నెట్టింట్లో వీడియో వైరల్​

Allu Arha: అల్లు అర్జున్​ గారాల పట్టి అర్హ పుట్టిన రోజు ఈరోజు. నవంబరు21, 2016న అర్హ పుట్టింది. నేటితో ఐదేళ్లు పూర్తిచేసుకుని.. ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఓ వీడియోను బన్నీ భార్య స్నేహ ఇన్​స్టాగ్రామ్​ వేదికగా షేర్ చేసింది. అందులో అర్హ చెస్​ గేమ్ ఆడుతూ కనిపించింది. ఒక్కో చెస్​ గేమ్​బోర్డులో పావులు తదుపుతూ.. కేరింతలూ కొడుతూ.. చిందులేస్తూ కనిపించింది. తనను బన్నీ కుటుంబం ప్రోత్సహిస్తూ.. కనిపించారు. ఆ తర్వాత గేమ్​లో తాను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 21, 2021 / 11:30 AM IST
    Follow us on

    Allu Arha: అల్లు అర్జున్​ గారాల పట్టి అర్హ పుట్టిన రోజు ఈరోజు. నవంబరు21, 2016న అర్హ పుట్టింది. నేటితో ఐదేళ్లు పూర్తిచేసుకుని.. ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఓ వీడియోను బన్నీ భార్య స్నేహ ఇన్​స్టాగ్రామ్​ వేదికగా షేర్ చేసింది. అందులో అర్హ చెస్​ గేమ్ ఆడుతూ కనిపించింది. ఒక్కో చెస్​ గేమ్​బోర్డులో పావులు తదుపుతూ.. కేరింతలూ కొడుతూ.. చిందులేస్తూ కనిపించింది. తనను బన్నీ కుటుంబం ప్రోత్సహిస్తూ.. కనిపించారు. ఆ తర్వాత గేమ్​లో తాను గెలుచుకున్న బహుమతులను ఫ్యామిలీకి చూపించింది అర్హ. బన్నీ, స్నేహ.. అర్హ ఆటను ప్రేమతో ఆనందిస్తుండగా.. అల్లు అరవింద్​ మనవరాలిని ముద్దు చేస్తూ కనిపించారు.

    https://www.instagram.com/reel/CWhhPDWlrIf/?utm_source=ig_web_copy_link

    అల్లు అర్జున్ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చప్పాల్సిన పనిలేదు. సమయం దొరికినప్పుడల్లా.. తన పిల్లలో సరదాగా గడుపుతుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో షేర్​ చేస్తూ ఉంటారు.

    కాగా, ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మికా హీరోయిన్​గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్​, సునీల్​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనమివ్వనుంది. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.  రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తొలి పార్ట్ డిసెంబరు 17న విడుదల కానుంది.