Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam: 'ఈ రాతలే' పాటలోనే 'రాధేశ్యామ్'​ కథ ఉందంట

Radhe Shyam: ‘ఈ రాతలే’ పాటలోనే ‘రాధేశ్యామ్’​ కథ ఉందంట

Radhe Shyam: ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. యూరప్​ నేపథ్యంలో పీరియాడికల్​ లవ్​స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టీజర్​, తొలి రిలికర్ సాంగ్స్​తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ రాతలే పాట సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.

Ee Raathale Lyrical Video Song | Radhe Shyam | Prabhas,Pooja Hegde | Justin Prabhakaran | Krishna K

కాగా, ఈ పాటకు కృష్ణకాంత్​ రచయితగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సినిమాతోపాటు ఈ పాట గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాధేశ్యామ్ సినిమా పునర్జన్మకు సంబంధించి కథ అని, టైమ్ ట్రావెల్​ అని, ట్రైన్​లోనే సినిమా మొత్తం జరుగుతుందని ఇలా ఎవరికి వారు ఊహలు అల్లుకుంటున్నారు. అయితే, ఈ కథ ఏంటనేంది వారి ఊహలకు వదిలేస్తున్నానని అన్నారు.

ఇక తను రాసిన ఈ రాతలే పాట గురించి చెప్తూ.. ఆ పాట అందరికీ అర్థం కాదు. విజువల్స్ చూస్తే కానీ, అసలు ఎలా రాయడానికి కారణం తెలియదు. నిజానికి ఈ పాటలోనే సినిమా కథ ఉంది. అని చెప్పుకోచ్చారు కృష్ణకాంత్​.ప్రస్తుతం ఈయన శ్యామ్​ సింగరాయ్​తోపాటు, ది ఘోస్ట్​, మేజర్​, హిట్​2 సినిమాలకూ పాటలు రాస్తున్నారు. కాగా, ప్రభాస్​ రాధేశ్యామ్​తో పాటు, సలార్​, ఆదిపురుష్​లోనూ నటిస్తున్నారు. ఇటీవలే ఆదిపురుష్​ షూటింగ్​ పూర్తి చేసుకున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version