AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు ముందుకెళ్తున్నాయి. ప్రతిపక్షాలు అధికారపక్షం, అధికార పార్టీ ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఏదైనా మంచి పని చేస్తుంటే అడ్డుపడుతున్నాయని జగన్ చెబుతుంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఓ పక్క జగన్ సంక్షేమ పథకాలతో ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి ప్రజల ఖాతాల్లో నిధులు సమకూరుస్తున్నారు.

జగన్ తన భాషలో బూతు పదాలు వాడారు. మంత్రి కొడాలి నానిలా తన మాటలు ఉన్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో ముందుకెళ్తున్న తరుణంలో నా వెంట్రుక కూడా పీకలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై తనలోని కోపాన్ని ప్రదర్శించారు. భవిష్యత్ లో కూడా ఇలాగే సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతాయని చెప్పారు. ఎవరేమనుకున్నా ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా భయపడేది లేదు. రాబోయే ఎన్నికల్లో కూడా విజయం మాదే అని భరోసా కల్పించారు.
Also Read: AP Cabinet Reshuffle: వడబోతలో తడబడుతూ.. మంత్రివర్గ కూర్పులో సీఎం జగన్ బిజీబిజీ
దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంటే శ్రీలంక పరిస్థితి వస్తుందని భయం వ్యక్తం చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షాలు అధికార పక్షానికి సహకరిస్తుంటే ఇక్కడ మాత్రం అలా కాకుండా విమర్శలకు పెద్దపీట వేస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న నంద్యాల జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు జగన్ తన అక్కలు వెళ్లగక్కారు. రాష్ర్ట పరువు తీసే ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. పక్క రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికార పార్టీలకు సహకరిస్తుంటే ఇక్కడ మాత్రం ఢిల్లీ వేదికగా నిందలు వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
విద్యుత్ కోతలు, డ్రగ్స్ రవాణా, నాటు సారా విక్రయాలు, కోర్టు వ్యతిరేక తీర్పులు, ఆర్థిక సంక్షోభం వెంటాడుతుండటంతో భవిష్యత్ పై అందరిలో బెంగ పట్టుకుంది. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న వైసీపీ ఏ మేరకు ప్రజలను ఆదుకుంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. జగన్ మీడిపై నిప్పులు చెరుగుతున్నారు. ఎల్లో మీడియా ఏది చేసినా ప్రభుత్వంపై బురద జల్లేందుకు నిర్ణయించుకుందని వాపోతున్నారు. మరోవైపు రాష్ర్టంలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా పొత్తుల విషయంలో కూడా ఇంతవరకు స్పష్టత రాలేదు. పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి నడుస్తున్నామని చెబుతున్నా చంద్రబాబు సైతం జగన్ తో కలిసేందుకు ఇష్టపడటంతో భవిష్యత్ లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. బీజేపీ మాత్రం చంద్రబాబుతో పొత్తుకు ససేమరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీల వ్యూహాలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు అన్ని పార్టీలు సిద్ధం కానున్నాయని తెలుస్తోంది.
Also Read:Frustration: జగన్ ఫ్రస్టేషన్ పీక్స్.. ‘వెంకీ’ ఆసనం వేయాల్సిందేనా?
[…] Also Read: వెంట్రుక కూడా పీకలేరు.. జగన్ ధైర్యం వె… […]
[…] TRS Party: ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యత్రేతాస్తు’ అన్నట్లు ఎక్కడ మహిళలు గౌరవింప బడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మహిళ కంట కన్నీరొలికితే అందరికీ అరిష్టమే.. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎప్ పార్టీలో మహిళా నేతలకు వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. పురుషాధిక్య పార్టీలో ఆమెకు గౌరవం దక్కడం లేదు.. మహిళలకు కేసీఆర్ ఓ అన్నలా.. ఆడ పిల్లలకు తండ్రిలా.. వృద్ధులకు కొడుకులా ఉంటాడని చెప్పుకునే ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు.. పార్టీలో మహిళలకు ఎదురవుతున్న పరాభవంపై మాత్రం నోరు మెదపడం లేదు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి తనయుడు కె.తారకరామారావు మహిళా నేతలను అవమానించే వారిని కనీసం మందలించిన దాఖలాలు కూడా లేవు. దీంతో గులాబీ గూటిలో మహిళా నేతలకు కన్నీరే మిగులుతోంది. […]