Pakistan Politics: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామాకు రంగం సిద్ధమైంది. ప్రతిపక్షాలు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న అవిశ్వాసం తీర్మానం నేడు జాతీయ అసెంబ్లీలో జరగనుంది. గత వారం క్రితమే జరగాల్సిన అవిశ్వాస తీర్మానం.. ఇమ్రాన్ వ్యూహాలతో వాయిదా పడుతూ వచ్చింది. కానీ సీన్ లోకి కోర్టు ఎంట్రీ ఇవ్వడంతో ఈరోజు అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా జరగనుంది. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గేలా కనిపించడం లేదు.

ఈ విషయం ఇమ్రాన్ ఖాన్ కు కూడా స్పష్టంగా తెలుసు. అందుకే ఇన్ని రోజులు తనకు దూరమైన మిత్రపక్షాలను దగ్గర చేసుకునేందుకు అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేసేలా చూసుకున్నారు. కానీ బ్యాడ్ లక్.. రంగంలోకి కోర్టు ఎంట్రీ ఇవ్వడంతో ఇమ్రాన్ పదవి పోయేలా ఉంది. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 స్థానాలు ఉన్నాయి కాగా ఇందులో 172 ఓట్లు వస్తే ఇమ్రాన్ పదవి అలాగే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్రాన్ కు అన్ని ఓట్లు వచ్చే అవకాశం లేదు.
Also Read: Frustration: జగన్ ఫ్రస్టేషన్ పీక్స్.. ‘వెంకీ’ ఆసనం వేయాల్సిందేనా?
దీంతో పరోక్షంగా ఆయన తన ఓటమిని అంగీకరించారు. చివరిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా సందర్భంగా శాంతియుతంగా నిరసనలు తెలపాలంటూ తన మద్దతుదారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో భారత్ మీద కూడా ప్రశంసలు కురిపించారు. భారత్ ను ప్రపంచంలోని ఏ దేశం కూడా శాసించే లేదని, సార్వభౌమాధికార దేశం అంటూ పొగడ్తలు కురిపించారు.
ఇదే సమయంలో తాను కోర్టు తీర్పును గౌరవిస్తానని చెబుతూనే.. అమెరికా దౌత్యవేత్త తమ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి పంపిన బెదిరింపు లేఖను కూడా పరిశీలించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఎలాగూ ఇమ్రాన్ ఖాన్ ఓడిపోవడం ఖాయమని తేలిపోవడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయి. అందరి మద్దతు ఉన్న ప్రతిపక్ష ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అధినేత షేహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హే పనిలో భాగంగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను లండన్ నుంచి రానున్నారు.

కొత్త ప్రభుత్వంలో మిత్రపక్షాల నేతలందరికీ కేబినెట్లో అవకాశం ఇవ్వాలని చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. పాక్ ఆర్థిక అభివృద్ధి మాత్రం పెరిగే అవకాశం లేదు. అయితే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని మాత్రం కొంతమేర తగ్గించవచ్చు. దేశ ప్రజల మన్ననలు పొందడంలో ఇమ్రాన్ ఖాన్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. ప్రజల మద్దతు ఉన్నట్లయితే ఎవరెన్ని కుట్రలు చేసినా ఆయన ప్రధానిగా కొనసాగేవారు. కానీ ఇన్నేళ్ల పాలనలో ఆయన వెనుకబడ్డారు. మరి కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ప్రజల అభిమానాన్ని ఏమేరకు పొందుతుందో చూడాలి.