CM Jagan: జగన్ యాక్షన్.. అధికారుల ఓవర్ యాక్షన్

CM Jagan: పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలకు రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం భారీగానే చోటుచేసుకోగా.. వేలాది మంది వారికి ఉన్న నీడను కోల్పోయారు. దిక్కులేని వాళ్లలా రోడ్డున పడ్డారు. పంటపొలాలు నీటమునగగా.. గొడ్డూ, గోద వరదలో కొట్టుకుపోయాయి. వారం రోజులకు పరిస్థితి కాస్త చక్కపడగా.. మధ్యలో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి వరద పరిస్థితిపై, అక్కడ ఇబ్బందులు పడుతున్న వారిని గురించి పట్టించుకోలేదన్న ఆరోపణలు తీవ్రంగా […]

Written By: Neelambaram, Updated On : December 4, 2021 11:54 am
Follow us on

CM Jagan: పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలకు రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం భారీగానే చోటుచేసుకోగా.. వేలాది మంది వారికి ఉన్న నీడను కోల్పోయారు. దిక్కులేని వాళ్లలా రోడ్డున పడ్డారు. పంటపొలాలు నీటమునగగా.. గొడ్డూ, గోద వరదలో కొట్టుకుపోయాయి. వారం రోజులకు పరిస్థితి కాస్త చక్కపడగా.. మధ్యలో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి వరద పరిస్థితిపై, అక్కడ ఇబ్బందులు పడుతున్న వారిని గురించి పట్టించుకోలేదన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. ఈ క్రమంలో రెండు, మూడు రోజులపాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలోని కడప, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు ఓవర్ యాక్షన్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన ఉందని ముందుగానే తెలుసుకుని ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తారో.. ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశారని సమాచారం. అంటే.. జగన్ ఎక్కడెక్కడ తిరగాలి.. ఎవరితో మాట్లాడాలి.. సీఎం జగన్ తో ఎవరెవరు మాట్లాడాలి..? సమస్యలు ఎవరు చెప్పాలి.. జేజేలు ఎవరు కొట్టాలి అనే అంశం మొత్తం అధికారులు ముందుగానే రెడీ చేసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో జగన్ పర్యటించిన పలు ప్రాంతాల్లో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించే సమయంలో జగన్ దగ్గరికి ఎవరు ఎవరు రావాలి..? జగన్ తో ఎవరు మాట్లాడాలి.. ఏఏ సమస్యలపై మాత్రమే చర్చించాలనే అంశాన్ని ముందుగానే చెప్పి ఉంటారు. ఇదే క్రమంలో జగన్ పర్యటించే ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజల వద్దకు ముందుగానే గ్రామ వలంటీర్లను పంపించి.. ముందస్తు ప్రిపరేషన్ చేశారని చెప్పుకుంటున్నారు.

Also Read: Rosaiah Death: చిరంజీవిని రాజకీయాల్లోకి తెచ్చి.. వైఎస్ఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా మారి.. రోశయ్య ప్రస్థానం

అంటే.. ఒక ప్రతిపక్ష నేతగా మూడువేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ సమయంలో.. ప్రజలతో కలిసిపోయారు. ప్రతీఒక్కరి ఇంటికి వెళ్లారు. అక్కున చేర్చుకున్నారు. సమస్యలు ఓపిగ్గా విన్నారు. పరిష్కారానికి మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉన్న సమయంలో ఉన్న కలుపుగోలు తనం ఇప్పుడు ఎందుకు లేదని కొందరు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి ప్రొటోకాల్ ప్రకారం.. నిక్కచ్చిగానే వ్యవహరించాలి.. అయితే.. మరీ సెలెక్టెడ్ వ్యక్తులతోనే మాట్లాడడం.. అందుకు సంబంధించిన స్క్టిప్టు కూడా అధికారులే ప్రజలకు ముందుగా ఇవ్వడం ద్వారా ప్రజల్లో జగన్ ఉండే మైలేజీ దెబ్బతింటుందని కొందరు అంటున్నారు. భవిష్యత్ లో ఇది ప్రమాదకరమని.. రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Also Read: Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య ఇకలేరు.. ఆయన ప్రస్థానం..!

Tags