Akhanda: అసలే బాలయ్య.. చాలా గ్యాప్ తర్వాత కసితో సినిమా చేశాడు. వరుస ఫ్లాపుల తర్వాత బోయపాటి శీను అంతే పట్టుదలతో సినిమా తీశాడు. హిట్ కొట్టాలని మాస్ మాసాలా బాగా దట్టించారు. ఫలితం సినిమా అద్భుతంగా వచ్చింది. మంచి టాక్ అందుకొని థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాను చూడడానికి జనాలు థియేటర్లకు వస్తున్నారు.
ఇక సినిమా మనిషి అయితే వింటేజ్ క్రియేషన్స్ అధినేత, తూర్పు గోదావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ జాస్తి రామకృష్ణ(49) తాజాగా అఖండ సినిమాను థియేటర్లో చూశారు. బాలయ్య యాక్టింగ్.. పవర్ ఫుల్ డైలాగులు, సినీ మాయాజాలాన్ని ఎంజాయ్ చేశారు.
అయితే ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా ‘అఖండ’ సినిమా చూస్తుండగానే కిందపడిపోయారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో థియేటర్ లోనే కుప్పకూలిపోయాడు.
Also Read: ఓవర్సీస్లో భారీ వసూళ్లతో దూసుకెళ్లిపోతున్న ‘అఖండ’
వెంటనే థియేటర్ యాజమాన్యం రామకృష్ణను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందారు.
రాజమండ్రిలోని నామవరం వీఎస్ మహల్ థియేటర్ ప్రొప్రైటర్ గా.. జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేష్ అధ్యక్షుడిగా ఉన్న ఈయన హఠాన్మరణం సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది.
రామకృష్ణకు భార్య శిరీష, ఇద్దరు పిల్లలున్నారు. ఈయన మృతి పట్ల ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ సభ్యులు సంతాపం తెలిపారు.
Also Read: బాలయ్య అఖండ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది ఎవరంటే…