ఏపీలో ర్యాపిడ్ టెస్ట్ లకు ఫుల్ స్టాప్!

ఆంద్రప్రదేశ్ లో అధికార పక్షానికి, విపక్షాలకు మధ్య రాజకీయ వేడి రాజేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ లు ఇప్పుడు అన్ని జిలా కేంద్రాలకు చేరాయి. ఏ రోజు నుంచి అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. నిన్న రాత్రి ఐ.సి.ఎం.ఆర్ నుండి రెండు రోజులు రాపిడ్ టెస్ట్ లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ర్యాపిడ్ టెస్టులు నిలిచిపోయాయి. దీంతో బుధ, గురు వారాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించేందుకు అవకాశం లేకుండా […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 3:53 pm
Follow us on


ఆంద్రప్రదేశ్ లో అధికార పక్షానికి, విపక్షాలకు మధ్య రాజకీయ వేడి రాజేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ లు ఇప్పుడు అన్ని జిలా కేంద్రాలకు చేరాయి. ఏ రోజు నుంచి అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. నిన్న రాత్రి ఐ.సి.ఎం.ఆర్ నుండి రెండు రోజులు రాపిడ్ టెస్ట్ లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ర్యాపిడ్ టెస్టులు నిలిచిపోయాయి. దీంతో బుధ, గురు వారాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయిందని గుంటూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ శాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువచ్చారు.

ర్యాపిడ్ టెస్టుల ఫలితాలు 5.4 శాతం మాత్రమే ఖచ్చితత్వం వస్తోందని రాజస్థాన్ రాష్ట్రం ఐ.సి.ఎం.ఆర్ దృష్టికి తెచ్చింది. దేశంలోనే కరోనా అనుమానితులకు అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్టంగా రాజస్థాన్ గుర్తింపు పొందింది. ఛత్తీస్ ఘడ్ కూడా ర్యాపిడ్ టెస్టుల పనితీరు సక్రమంగా లేదనే విషయాన్ని వెల్లడించింది. ఐ.సి.ఎం.ఆర్ తదుపరి ఆదేశాలు, టెస్ట్ ల మార్గదర్శకాలు ఇచ్చే వరకూ రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ లు వినియోగించే అవకాశం కనిపించడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా సంస్థ నుంచి 10 లక్షల కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో కిట్ కు ప్రభుత్వం రూ.730 లకు చెల్లిస్తోంది. తొలివిడతగా కేవలం లక్ష కిట్ లు మాత్రమే రాష్ట్రానికి చేరుకున్నాయి. మరో 9 లక్షల టెస్ట్ కిట్ లు భవితవ్యం ఇప్పుడు అర్థం కాకుండా పోయింది. ఒకవైపు రూ. 337 కిట్ ను రూ.730 కొని కుంభకోణానికి పాల్పడ్డారని రాజకీయంగా విమర్శలు వస్తుంటే..రూ.337 లకే కొనుగోలు చేస్తామని ఒప్పడంలో ఆ షరతు ఉందని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రకటించారు. మరోవైపు ఈ కిట్ ల పనితీరు సక్రమంగా లేదని ఐ.సి.ఎం.ఆర్ ఈ కిట్ లతో పరీక్షలు 48 గంటలు నిలిపివేయాలని కోరడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఏదేమైనా రాష్ట్రంలో ప్రస్తుతానికి ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో కరోనా అనుమానితులకు పరీక్షలు నిలిపివేశారు.