https://oktelugu.com/

సూర్యాపేటపై సీఎం స్పెషల్ ఫోకస్

తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో ఇప్పటివరకు 928కరోనా కేసులు నమోదుకాగా 190మంది కోలుకున్నారు. 23కరోనాతో మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్, సూర్యపేటలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. మంగళవారం రాష్ట్రంలో 56 కొత్త కేసులు నమోదుకాగా ఒక్క సూర్యాపేటలోనే 26నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ తర్వాత స్థానంతో సూర్యపేట జిల్లా ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాపై స్పెషల్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 22, 2020 / 02:26 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో ఇప్పటివరకు 928కరోనా కేసులు నమోదుకాగా 190మంది కోలుకున్నారు. 23కరోనాతో మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్, సూర్యపేటలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. మంగళవారం రాష్ట్రంలో 56 కొత్త కేసులు నమోదుకాగా ఒక్క సూర్యాపేటలోనే 26నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ తర్వాత స్థానంతో సూర్యపేట జిల్లా ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం ఆదేశాలతో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూర్యాపేట జిల్లాలో బుధవారం పర్యటించారు.

    జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదైన సూర్యాపేట కూరగాయాల మార్కెట్‌ను వారు సందర్శించారు. కరోనా వైరస్ కట్టడికి అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సూర్యాపేటలో సిబ్బంది ఇప్పటివరకు కరోనా నియంత్రణ చర్యలు బాగా చేపట్టారన్నారు. సిబ్బందికి తాము మరింత సహకారం అందించేందుకు తాము జిల్లాలో పర్యటించినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎం ఆదేశాలతో ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు.

    సూర్యాపేటది ఓ స్పెషల్ కేసని.. ఇక్కడ ఒక్కరి నుంచి చాలామందికి వ్యాపించిందని డీజీపీ తెలిపారు. అధికారులకు ధైర్యం కల్పించేందుకు తాము వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సూర్యాపేట పర్యటన తర్వాతం వారంతా జోగులాంబ గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లోని హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరి వెళ్లారు.