తెలుగు రాష్ట్రాలకు ‘తళపతి విజయ్’ భారీ విరాళం

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. కరోనా మహమ్మరిపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా తగ్గముఖం పట్టడంలేదు. మరోవైపు లాక్డౌన్ అమలుతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాపై వైద్యులు, పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈమేరకు కరోనాపై పోరాటం పలువురు సెలబ్రెటీలు తమవంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సెలబెట్రీలు పెద్దసంఖ్యలో విరాళాలు ప్రకటించగా తాజాగా తమిళ స్టార్ హీరో […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 4:18 pm
Follow us on

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. కరోనా మహమ్మరిపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా తగ్గముఖం పట్టడంలేదు. మరోవైపు లాక్డౌన్ అమలుతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాపై వైద్యులు, పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈమేరకు కరోనాపై పోరాటం పలువురు సెలబ్రెటీలు తమవంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సెలబెట్రీలు పెద్దసంఖ్యలో విరాళాలు ప్రకటించగా తాజాగా తమిళ స్టార్ హీరో ‘ఇళయ దళపతి’ విజయ్ పీఎం సహాయనిధితోపాటు దక్షిణాది రాష్ట్రాలకు కలిపి రూ.1.30కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు, తమిళనాడు సీఎం సహాయనిధికి రూ.50లక్షలు, కేరళ సీఎం సహాయనిధికి రూ.10లక్షలు, తెలంగాణ, ఆంధప్రదేశ్, కర్ణాటక, పూదిచ్చేరి రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ.5లక్షల చొప్పున, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు రూ.25లక్షల విరాళాన్ని ఇళయ దళపతి విజయ్ ప్రకటించాడు. మొత్తంగా తమిళనాడుపాటు దక్షిణాది రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు విజయ్ విరాళం ప్రకటించడం చర్చనీయాంశం మారింది.

తాజాగా విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. దేశంలో కరోనా ఎఫెక్ట్ లేనట్లయితే ఈపాటికే ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేది. కాగా లాక్డౌన్ ముగిశాక జూలైలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ‘మాస్టర్’ చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. అయితే కరోనా అనంతరం సినిమా షూటింగ్ ప్రారంభమైనా.. థియేటర్లకు ఎప్పుడు అనుమతిస్తారో తెలియడం లేదు. దీంతో ఈ మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ అవడం కష్టంగానే కన్పిస్తుంది. భవిష్యత్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..!