Homeఅంతర్జాతీయంSrilanka Crisis: ఆర్థిక సంక్షోభం: శ్రీలంకలో ఎమర్జెన్సీ

Srilanka Crisis: ఆర్థిక సంక్షోభం: శ్రీలంకలో ఎమర్జెన్సీ

Srilanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పెరుగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నానాటికి పరిస్థితి దిగజారిపోతోంది. ఆహారం అందుబాటులో ఉండటం లేదు. ధరలు అమాంతం పెరిగాయి. దీంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చిన్నపిల్లలకు పాలు కూడా దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దిగాజారిందో తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్సే అనాలోచిత నిర్ణయాల కారణంగా సంక్షోభంలోకి వెళ్లిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం గమనార్హం.

Srilanka Crisis
Srilanka Crisis

విద్యుత్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకు దాదాపు 13 గంటల పాటు విద్యుత్ కోతలు అమలు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో ఏర్పడిన పరిస్థితికి అధ్యక్షుడు రాజపక్సే కారణమంటూ నిరసన కారులు ఆందోళన చేపట్టారు. కరోనా కారణంగా దేశంలో ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. కాగితం కొరతతో పరీక్షలు కూడా వాయిదా వేసే దుస్థితి రావడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: Jobs: అదిలాబాద్ రిమ్స్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.లక్షకు పైగా వేతనంతో?

దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. రాజపక్స అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాలతోనే దేశం అగాధంలో పడిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆదాయ పన్ను నుంచి మినహాయింపులు ఇచ్చినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఫలితంగా ప్రజలు అల్లాడుతున్నారు. ఆకలితో అతలాకుతలం అవుతున్నారు. నిత్యావసర ధరలు మాత్రం దిగి రావడం లేదు.

Srilanka Crisis
Srilanka Crisis

శ్రీలంక పరిస్థితికి చలించి భారత్ సాయం చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. సంక్షోభం తీవ్ర స్తాయికి చేరిన క్రమంలో శ్రీలంక కోలుకోవడం కలగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి భారత్ మరో 1 బిలియన్ డాలర్ల సాయం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ అందిస్తున్న సాయంతో మెరుగు కావాలని కోరుకున్నా సాధ్యపడటం లేదు. అందుకే శ్రీలంక కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: Imran Khan wife Reham khan :అంత సీన్ లేదు.. ఇమ్రాన్ ఖాన్ పరువు తీసిన ఆయన మాజీ భార్య

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

  1. […] Crazy Update On Rajamouli Mahabharatam: ‘ఎప్పటికైనా భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సాంప్రదాయ పద్దతులను ప్రపంచానికి చాటి చెప్పే కంటెంట్‌ ని సృష్టించాలనే ఆలోచన నాకు ఎప్పటినుండో ఉందని’ రాజమౌళి ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ముఖ్యంగా తన క‌ల‌ల చిత్రం `మ‌హా భార‌తం`ను తీయాలని జక్కన్న ఆశ పడుతున్నాడు. ఈ సినిమాని 5 భాగాలుగా తీయాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. పైగా ఈ సినిమాతో త‌న కెరీర్‌కి పుల్ స్టాప్ పెట్టాల‌నుకుంటున్నాను అని కూడా ఆ మధ్య జక్కన్న చెప్పాడు. […]

  2. […] Telangana Politics: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కిపోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ లో ఎండలతో పాటు తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మూడు పార్టీలు, వాటి వ్యూహకర్తలు ఏప్రిల్ లో పనితనం స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తరపున రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular