నారాయణ, శ్రీచైతన్యలపై హై కోర్ట్ ఆగ్రహం!

తెలంగాణలో గుర్తింపు లేకుండా నారాయణ, శ్రీచైతన్య ఇంటర్ కాలేజీలు కొనసాగడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం, పైగా అవి ఎటువంటి గుర్తింపు లేకుండా విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. ఆ విధంగా చేరిన విద్యార్థుల భవిష్యత్ ఏమిటని ఇంటర్మీడియట్ బోర్డు ను నిలదీసింది. గుర్తింపు లేని చోట చదివి మంచి మార్కులతో పాసైన విద్యార్థులకు తీరని అన్యాయమే జరుగుతుంది కదా? ఒకరిని హత్య చేసిన వ్యక్తి […]

Written By: Neelambaram, Updated On : February 18, 2020 2:20 pm
Follow us on


తెలంగాణలో గుర్తింపు లేకుండా నారాయణ, శ్రీచైతన్య ఇంటర్ కాలేజీలు కొనసాగడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం, పైగా అవి ఎటువంటి గుర్తింపు లేకుండా విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. ఆ విధంగా చేరిన విద్యార్థుల భవిష్యత్ ఏమిటని ఇంటర్మీడియట్ బోర్డు ను నిలదీసింది.

గుర్తింపు లేని చోట చదివి మంచి మార్కులతో పాసైన విద్యార్థులకు తీరని అన్యాయమే జరుగుతుంది కదా? ఒకరిని హత్య చేసిన వ్యక్తి మరొకరిని హత్య చేయబోనని అండర్‌‌‌‌ టేకింగ్‌‌‌‌ ఇస్తే హంతుకుడిని విదిలేస్తారా? గుర్తింపు లేని కాలేజీల్లో విద్యార్థులు చేరేలా మీరు పరోక్షంగా సహకరించినట్లు అనిపిస్తోందని అంటూ హై కోర్ట్ ఇంటర్బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ అనుబంధం లేని కాలేజీల్లో 15 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నట్లు ఇంటర్ బోర్డే కోర్టు దృష్టికి తేవడం పట్ల న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. అలాంటి కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూల్స్‌‌‌‌కు వ్యతిరేకంగా కాలేజీలను నడుపుతున్నాయని దాఖలైన పిల్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆర్ఎస్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ ఎ.అభిషేక్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారించింది.

ఇంటర్‌‌‌‌ బోర్డు తరఫున ప్రభుత్వ స్పెషల్‌‌‌‌ ప్లీడర్‌‌‌‌ సంజీవ్‌‌‌‌కుమార్‌‌‌‌ వాదిస్తూ.. అనుబంధం లేకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కాలేజీలను గుర్తించేందుకు అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వంద కాలేజీల తనిఖీ జరిగిందన్నారు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్‌‌‌‌ జిల్లాల్లో నారాయణ, శ్రీచైతన్య సంస్థలకు చెందిన పలు కాలేజీలకు అఫిలియేషన్‌‌‌‌ లేదని గుర్తించినట్లు వివరించారు.

ఫైర్‌‌‌‌ ఎన్‌‌‌‌వోసీ వంటివి అమలు చేయాలని షరతు పెట్టి అడ్మిషన్లకు పర్మిషన్‌‌‌‌ ఇచ్చినట్లు చెప్పారు. ఆ కాలేజీల్లో 15వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపింది. గుర్తింపు లేని కాలేజీలకు జరిమానాలు విధిస్తున్నాని పేర్కొన్నారు. ఇప్పటివరకు కొన్ని కాలేజీలు అడ్మిషన్లు అయ్యాక అనుబంధం కోసం దరఖాస్తు చేసుకున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల కంటే ముందే అనుబంధం దరఖాస్తులు పరిశీలించేలా చేస్తామని ఆయన తెలిపారు.

దీనిపై బెంచ్‌‌‌‌ స్పందిస్తూ.. ఇకపై చర్యలు తీసుకోవడం బాగానే ఉంటుందని, అయితే ఇప్పటివరకు జరిగిన దానికి, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్‌‌‌‌ జీవితాల గురించి ఏం చేస్తారని ప్రశ్నించింది.

‘‘ గుర్తింపు లేని కాలేజీల్లో అడ్మిషన్లకు ఓకే చెప్పడమేంది? ఇదే తరహాలో ఒక కేసులో సుప్రీంకోర్టు బాధిత విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించిన విషయాన్ని మరిచిపోయారా? ఆదిలోనే ఇంటర్‌‌‌‌బోర్డు ఉక్కుపాదం మోపకపోతే ఇదే తరహాలో మరిన్ని కాలేజీలు పుట్టుకొస్తాయని తెలియదా? అదే జరిగితే మరింత మంది విద్యార్థులు జీవితాలను మూల్యంగా చెల్లించుకోవాల్సివస్తుందని అధికారులకు తెలియదా?” అని నిలదీసింది.

‘‘భారీ తప్పిదానికి జరిమానాలు వేసి చేతులు దులుపుకుంటారా? మేము అమెరికాలో చదివి ఢిల్లీ యూనివర్సిటీకి అప్లికేషన్‌‌‌‌ పెట్టుకుంటే తోసిపుచ్చారు. నిబంధనలు అంత కఠినంగా ఉంటాయి. అలాంటిది పదిహేను వేల మంది ఇంటర్‌‌‌‌ విద్యార్థులు గుర్తింపులేని కాలేజీల్లో చదివితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరిపై చర్యలు తీసుకున్నారు? చట్ట ప్రకారం ఆయా కాలేజీలపై తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పండి” అని డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ప్రశ్నించింది.

అనుబంధం లేని కాలేజీల్లోని 15 వేల మంది స్టూడెంట్స్‌‌‌‌ గురించి ఏం చేస్తారో అదనపు కౌంటర్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.