https://oktelugu.com/

బాబుకు శ్రావణమాసం టెన్షన్..!

ఆషాడం వెళ్లిపోయింది.. ఆకర్ష్ మొదలైంది. నిన్నటిదాక మంచి ముహుర్తాలు లేకపోవడంతో సైలంట్ ఉన్న నేతలంతా ఇప్పుడు అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతోన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి టీడీపీ ఎమ్మెల్యేలు శ్రావణమాసంలో జలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోన్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డికి జై కొట్టడంతో బాబు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: రాజధాని రైతులపై పవన్ కి చిత్తశుద్ధి ఉందా? టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు జగన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2020 11:52 am
    Follow us on


    ఆషాడం వెళ్లిపోయింది.. ఆకర్ష్ మొదలైంది. నిన్నటిదాక మంచి ముహుర్తాలు లేకపోవడంతో సైలంట్ ఉన్న నేతలంతా ఇప్పుడు అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతోన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి టీడీపీ ఎమ్మెల్యేలు శ్రావణమాసంలో జలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోన్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డికి జై కొట్టడంతో బాబు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: రాజధాని రైతులపై పవన్ కి చిత్తశుద్ధి ఉందా?

    టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు జగన్ చెక్ పెట్టేందుకు స్కెచ్ వేస్తున్నాడు. దీనిలో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ నేతలు గాలం వేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు జై కొట్టారు. నిన్నటిదాకా ఆషాడం కావడంతో చేరికలకు బ్రేక్ ఇచ్చింది. ఇక శ్రావణమాసం మొదలుకావడంతో పార్టీలో చేరికలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరేందుకు ఉత్సాహం చూపుతోన్నారు.

    ఇందులో ప్రముఖంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు విన్పిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీకి గంటా శ్రీనివాసరావు జై కొట్టడం కొత్తమేకాదు. ఆయన ఆగస్టు 15న వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మంత్రి సహకారంతో ఆయన వైసీపీలో చేరుతున్నారని సమాచారం. ఇప్పటికే టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరాంలు జగన్ కు జై కొట్టారు. దీంతో చంద్రబాబు బలం 20కి పడిపోగా గంటా కూడా వెళ్లిపోతే ఆయన బలం 19కి చేరుతోంది.

    Also Read: నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వ వైఖరి మారదా?

    మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడితే బాబుకు ఉన్న ప్రతిపక్ష హోదా పోవడం ఖాయంగా కన్పిస్తుంది. దీంతో వైసీపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎమ్మెల్యే వైసీపీలోకి వచ్చేందుకు సముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలతో బాబు ఫోన్లో మాట్లాడి వారికి భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలంతా బాబుతో ఉంటామని చెబుతున్నప్పటికీ ఆయనకు శ్రావణమాసం టెన్షన్ పట్టుకొంది.