
ఈనెల 31తో ఆన్ లాక్ 2.0 ముగియనుంది. దీంతో ప్రధాని మరోసారి మీడియా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏం చెబుతారనే ఆసక్తి నెలకొంది. మరోసారి లాక్ డౌన్ ఉంటుందా? లేదా ఆన్ లాక్ 3.0పైనే మరో ప్రకటన చేస్తారా? అనే చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు రెడీ అవుతున్నారు.
Also Read: నేపాల్ లో చైనా జోక్యాన్ని కమ్యూనిస్టులు ఖండించరా?
ప్రధాని మోదీ చివరిసారిగా జూన్ 16, 17తేదిల్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆన్ లాక్ 2.0ను జూలై 31వరకు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆన్ లాక్ 2.0లో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో కరోనా కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ ఈనెల 27న సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. అయితే ఈసారి కేవలం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలతోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
దాదాపు నెలన్నర తర్వాత ప్రధాని మోదీ ఈ మూడు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనుండటం ఆసక్తి రేపుతోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా అన్‌లాక్ 2.0పై రాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అనంతరం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేయనున్నారని సమాచారం. కాగా ఇటీవలే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తొమ్మిది రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో కరోనాపై తీసుకోవాలని జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు.
Also Read: కాంగ్రెస్ చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తుందా?
అయితే జూలై నెలలోనే దాదాపు 8లక్షల పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కరోనా కట్టడికి ప్రధాని మోదీ మరోసారి లాక్డౌన్ విధిస్తారా? లేక ఆన్ లాక్ 3.0కే మొగ్గుచూపుతారా? అనే ఆసక్తి నెలకొంది. దాదాపు నెలన్నర తర్వాత సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా విజృంభిస్తుండటం వేళ ప్రధాని మరోసారి మీడియా ముందుకు రానుండటంతో ఆయన ఏం ప్రకటన చేస్తారా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.