https://oktelugu.com/

చైనా మరో బయో వెపన్.. పాక్ లో తయారీ?

కరోనా వైరస్ ఎలా పుట్టింది? ఎలా వ్యాపించింది.? ఇంత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఎలా మరణాలు సంభవింపచేస్తోంది.? ఎందుకు మందులకు లొంగడం లేదన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అగ్రరాజ్యం అమెరికా మాత్రం ‘కరోనా వైరస్’ చైనా సృష్టించిన బయో వెపన్ అని ఆడిపోసుకుంటూనే ఉంది. చైనాలోని వూహాన్ లో దీన్ని తయారు చేశారని.. తయారు చేసిన శాస్త్రవేత్తలందరినీ చంపేశారంటోంది. అయితే ఈ వైరస్ చైనాలో కంట్రోల్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కంట్రోల్ కాకపోవడం చూస్తుంటే ఆ అనుమానాలకు బలం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 25, 2020 / 11:38 AM IST
    Follow us on


    కరోనా వైరస్ ఎలా పుట్టింది? ఎలా వ్యాపించింది.? ఇంత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఎలా మరణాలు సంభవింపచేస్తోంది.? ఎందుకు మందులకు లొంగడం లేదన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అగ్రరాజ్యం అమెరికా మాత్రం ‘కరోనా వైరస్’ చైనా సృష్టించిన బయో వెపన్ అని ఆడిపోసుకుంటూనే ఉంది. చైనాలోని వూహాన్ లో దీన్ని తయారు చేశారని.. తయారు చేసిన శాస్త్రవేత్తలందరినీ చంపేశారంటోంది.

    అయితే ఈ వైరస్ చైనాలో కంట్రోల్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కంట్రోల్ కాకపోవడం చూస్తుంటే ఆ అనుమానాలకు బలం చేకూరేలాగానే పరిణామాలున్నాయి. అయితే ఇప్పటికే ఒక కరోనా వైరస్ తో అభాసుపాలైన చైనా ఈ సారి రూటు మార్చిందని తెలిసింది. మరో బయో వెపన్ తయారీని తమ దేశంలో నిర్వహించకూడదని డిసైడ్ అయినట్టు సమాచారం.

    Also Read: నేపాల్ లో చైనా జోక్యాన్ని కమ్యూనిస్టులు ఖండించరా?

    చైనా తన మిత్ర దేశం పాకిస్తాన్ తో కలిసి ఈ కొత్త బయోవెపన్ ను భారత సరిహద్దుల్లో తయారు చేయడానికి పూనుకుందన్న వార్త జాతీయ మీడియాల్లో సంచలనం రేపుతోంది. చైనా దేశం పాకిస్తాన్ తో కలిసి ఈ కొత్త వైరస్ పై ప్రయోగాలు చేస్తున్నదని తేలింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీతో చైనా ఒప్పంద చేసుకున్నట్టు జాతీయ మీడియా తెలిపింది.

    విశేషం ఏంటంటే ఈ భారీ బయో వెపన్ ఖర్చు అంతా చైనాదేనట.. కానీ చైనా భూభాగంలో చేయకుండా పాకిస్తాన్ లో ప్రయోగాలు చేస్తుందని మీడియా తెలిపింది. ఇందులో పాకిస్తాన్ ఆరోగ్యశాఖకు.. పాకిస్తాన్ యూనివర్సిటీలకు పాత్ర లేకుండా మొత్తం చైనీస్ పరిశోధకులే తతంగం నడిపిస్తున్నారని తేలింది.

    ఆంథ్రాక్స్ జాతికి చెందిన ‘సీసీహెచ్.ఎఫ్.వీ’ అనే వైరల్ ఫీవర్ పై పాకిస్తాన్ లో చైనా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ వైరల్ ఫీవర్ వస్తే 25శాతం మంది ప్రపంచవ్యాప్తంగా మరణించే అవకాశం ఉందని సమాచారం.. అంతటి భయంకరమైన వైరల్ రకం జ్వరం వచ్చిన వ్యక్తులు కోలుకోవడం చాలా కష్టం అని చైనా పరిశోధకులు కనిపెట్టారు. రిస్క్ ఎక్కువగా ఉండడంతోనే చైనాలో చేయడం కంటే పాకిస్తాన్ లో చేయడం బెటర్ అని ఇక్కడికి చైనా మార్చినట్టు సమాచారం.

    Also Read: కాంగ్రెస్ చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తుందా?

    ఇలా పొరుగున ఉన్న భారత్ సహా ప్రపంచదేశాలపై మరో కొత్త వైరస్ ప్రయోగించడానికి చైనా-పాకిస్తాన్ చేతులు కలిపాయని వెలువడ్డ కథనాలు సంచలనంగా మారాయి. ఖచ్చితంగా ‘సీసీహెచ్.ఎఫ్.వీ’ వైరస్ బయో వెపన్ గానే చైనా తయారు చేస్తున్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి పాకిస్తాన్ సహకరించడం.. తయారీని తన దేశంలో చేయడంతో ఇది భారత్ కు పెనుముప్పుగానే భావిస్తున్నారు.

    – ఎన్నం