Special status to AP: ఏపీకి ప్రత్యేక హోదా.. పుట్టుకొచ్చిన కొత్త ఆశ!

Special status to AP: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పటిది కాదు.. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇక్కడి పార్టీలు, ప్రజలు కోరుతున్న ప్రధాన డిమాండ్. ఉద్యమాలు నడిచినా కూడా కేంద్రం అయితే ప్రత్యేక హోదా ఇచ్చింది లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆశలు వదులుకున్న ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి. నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తాజాగా బీహార్ కు […]

Written By: NARESH, Updated On : December 17, 2021 5:36 pm
Follow us on

Special status to AP: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పటిది కాదు.. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇక్కడి పార్టీలు, ప్రజలు కోరుతున్న ప్రధాన డిమాండ్. ఉద్యమాలు నడిచినా కూడా కేంద్రం అయితే ప్రత్యేక హోదా ఇచ్చింది లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆశలు వదులుకున్న ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి.

ap special stutus

నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తాజాగా బీహార్ కు ప్రత్యేక కేటగిరి హోదా కల్పించాలనే డిమాండ్ ను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఎందుకంటే రాష్ట్రం కొన్ని పారామితులలో వెనుకబడి ఉందని తెలిపారు.బీహార్ అనేక రంగాలలో వేగంగా పురోగతి సాధించినప్పటికీ.. దాని పునాది ఇప్పటికీ బలహీనంగా ఉంది. దీని ఫలితంగా కొన్ని రంగాలలో ఇతర రాష్ట్రాలతో సరిపెట్టుకోలేకపోయింది.

ప్రత్యేక కేటగిరి హోదా కల్పించాలని బీహార్ కు కోరమాని.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికను తీవ్రంగా పరిశీలిస్తున్నామని రాజీవ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.

ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని.. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఏ రాష్ట్రానికి అలాంటి హోదా ఇవ్వబోమని ఇన్నాళ్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు నిధులు పంపిణీ చేసే నీతి అయోగ్ చైర్మన్ బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అనడంతో ఏపీకి కొత్త ఆశలు చిగురించాయి.

మోడీ ప్రభుత్వంపై ఎంత హోదా ఒత్తిడి తీసుకొచ్చినా.. రాజీనామాలు చేస్తామన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను పట్టించుకున్న పాపాన పోలేదు. జార్ఖండ్, ఒడిశా వంటి మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం అభ్యర్థించినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఏపీ ప్రత్యేక హోదాపై జగన్ ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని నిలదీస్తున్నప్పటికీ రాష్ట్రం నుంచి ప్రతీసారి అదే స్పందన వస్తోంది.

Also Read: పాలించే రాజుకు ఈ గుణం ఉంటే ఆ రాజ్యం సర్వనాశనమే..?

అయితే ఇప్పుడు బీహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ ను పరిశీలిస్తున్నామని నీతి అయోగ్ స్వయంగా ప్రకటించడం జగన్ ప్రభుత్వానికి కూడా కొత్త ఆశను కలిగించింది. ఏపీకి ప్రత్యేక హోదాను పరిగణలోకి తీసుకోవాలని.. బీహార్ కు హోదా ఇస్తే ఏపీ డిమాండ్ ను కేంద్రం విస్మరించించదని మరోసారి దీనిపై ఒత్తిడి తేవాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి గెలిచిన చంద్రబాబు దాన్ని సాధించకపోవడంతో మరుసటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు అదే హోదా కోసం బాబు రాజీనామాలు చేద్దామని సవాల్ చేస్తున్నారు. బీహార్ తోపాటు ఏపీకి హోదా డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటన చేసినా అది జగన్ కు మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. మరి అది జరిగితే మాత్రం ఏపీ ప్రజల కష్టాలు కొంతైనా తీరుతాయి.

Also Read: సారూ.. చాలా బిజీ.. ఐపీఎస్ లతో కూడా మాట్లాడలేదట?