Bhadradi Kothagudem: ఆచరించి చెప్పే వాడే ఆచార్యుడు అని మహాత్మాగాంధీ చెప్పారు. విలువలు చెప్పడమే కాదు వాటిని బోధించే వారు కూడా వాటిని పాటించి తీరాలి. కానీ సమాజంలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే సిగ్గేస్తుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే తప్పు చేస్తే ఎలా? భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే పవిత్ర బాధ్యత గురువులపై ఉంద. అందుకే మాతృదేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ అంటూ సంబోధించారు. కానీ నేటి కాలంలో ఆ మాటలకు అర్థాలే లేకుండా చేస్తున్నారు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ అపవిత్రమైన పనులు చేస్తూ సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరిగిన ఓ సంఘటన ఉపాధ్యాయుల పాత్రను ప్రశ్నిస్తోంది. వారిలోని అసహజ ప్రవర్తనను బయటపెడుతోంది. విద్యార్థులకు విలువలు నేర్పుతున్న వారే విలువలకు తిలోదకాలు ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. గురుతర బాధ్యతలను మరిచి సభ్య సమాజం తలదించుకునేలా చేయడం వారికే చెల్లుతోంది.
సాక్షాత్తు తరగతి గదిలోనే ఓ వైస్ ప్రిన్సిపాల్ మరో ఉపాధ్యాయురాలు ఏకాంతంగా దొరికి తలదించుకున్నారు. అదే కళాశాలలో పనిచేసే మరో ఉపాధ్యాయుడు వారి బాగోతాన్ని బయట పెట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గురువులా? కామ పిశాచాలా? అనే భావన అందరిలో వ్యక్తమవుతోంది. సభ్య సమాజానికి మార్గనిర్దేశకంగా ఉండాల్సిన వారే దారి తప్పుతుండటం జుగుస్సా కలిగిస్తోంది.
Also Read: D Srinivas: డీఎస్ రాకతో కాంగ్రెస్ బలపడుతుందా?
దీంతో సదరు ఉపాధ్యాయురాలు ఏకాంతంగా ఉండి ఏడ్చింది. తల్లిదండ్రులకు ఏం చెప్పుకోవాలని బాధ పడింది. చివరకు తన బతుకు ఎందుకని భావించింది. తాను ఉండే ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలుసుకున్న సదరు వైస్ ప్రిన్సిపాల్ పారిపోయాడు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల గతి తప్పిన విధానంపై విమర్శలు వస్తున్నాయి. గురువులే ఇలా చేయడంలో అంతరార్థం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సమాజానికి నీతి బోధించాల్సిన వారే గతితప్పితే ఎలా అనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: Industries: పరిశ్రమలు కోల్పోతున్న ఏపీ.. ఆహ్వానిస్తున్న తెలంగాణ