https://oktelugu.com/

Pushpa Movie: ‘పుష్ప’కు అక్కడ మైనస్.. ఇక్కడ ప్లస్?

Pushpa Movie: ‘అలవైకుంఠపురములో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు ఏమేరకు వస్తాయో? అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. కరోనా సమయంలో ఓటీటీకి అలవాటున సినీ ప్రేక్షకులను ‘అఖండ’ మూవీ థియేటర్లకు రప్పించింది. ఈ మూవీ బ్లాక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2021 5:32 pm
    Follow us on

    Pushpa Movie: ‘అలవైకుంఠపురములో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు ఏమేరకు వస్తాయో? అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.

    Pushpa Movie

    Pushpa Movie

    కరోనా సమయంలో ఓటీటీకి అలవాటున సినీ ప్రేక్షకులను ‘అఖండ’ మూవీ థియేటర్లకు రప్పించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టందుకోవడంతో పెద్ద సినిమాలన్నీ వరుసగా క్యూ కడుతున్నారు. ఈక్రమంలోనే అల్లు అర్జున్ ‘పుష్ప’ కూడా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ‘అల్లు అర్జున్’ వన్ మ్యాన్ షో చేశాడనే టాక్ ను సొంతం చేసుకున్నాడు.

    అయితే ఏపీలో సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం భారీ బడ్జెట్  సినిమాలకు మైనస్ గా మారుతోంది. తెలంగాణలో మునపటిలాగే టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలు, తొలివారం టికెట్ల రేట్లు పెంపు వంటి సదుపాయాలు కొనసాగుతున్నాయి. దీనికి భిన్నంగా ఏపీలో మాత్రం టికెట్ల రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలు వేశారనే నెపంతో థియేటర్ల యాజమాన్యాలపై కక్ష్య సాధింపు వంటి చర్యలు కొనసాగుతున్నాయి.

    ఇలాంటి పరిస్థితుల్లోనే ‘అఖండ’విడుదలై భారీ హిట్ అందుకుంది. అయితే టికెట్ల ధరల తగ్గింపుతో ఈసినిమాకు రావాల్సిన వసూళ్ల కంటే రూ.20కోట్ల మేర తక్కువగా వచ్చాయి. ఈక్రమంలోనే పెద్ద సినిమాల నిర్మాతలు ఆంధప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి టికెట్ల పెంచుకులానే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు మునిపటిలాగే టికెట్ల ధరలు పెంచుకునేలా పిటిషన్ దారులకు అవకాశం కల్పించింది.

    అయితే కోర్టు తీర్పు ప్రకారం టిక్కెట్టు ధరలు పెంచుకోవాలంటే మాత్రం కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలని మెలిక పెట్టింది. అయితే కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమలు చేసే అవకాశం లేదు. ఈ పరిణామం ‘పుష్ప’కు మైనస్ గా మారే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు తెలంగాణలో మాత్రం ‘పుష్ప’కు ఐదో ఆటకు అవకాశం ఇవ్వడంతోపాటు టికెట్ ధర రూ.250 విక్రయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

    Also Read: కేరళ అభిమానులను నిరాశ పరిచిన పుష్ప… కారణం ఏంటంటే

    కరోనా కారణంటా టాలీవుడ్ ఇండస్ట్రీ ఇబ్బందులకు గురైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీకి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈమేరకు పరిశ్రమ పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఈక్రమంలోనే ‘పుష్ప’కు తెలంగాణలో తొలి వారం టికెట్లు పెంచుకునే వెసులుబాటు ఉండటంతో ఈ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం కన్పిస్తోంది.

    ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ టాక్ రావడంతో ‘పుష్ప’ ఇండస్ట్రీని పాత రికార్డులను కొల్లగొడుతుందని అల్లు ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరోవైపు హిందీ, ఓవర్సీస్ లోనూ వచ్చే కలెక్షన్లపై ‘పుష్ప’ ఆశలు పెట్టుకుంది. కాగా ఏపీలో మాత్రం ‘పుష్ప’కు కలెక్షన్లు పెరిగే అవకాశం కన్పించడం లేదు. కోర్టు నుంచి ‘పుష్ప’కు అనుకూలంగా తీర్పు వచ్చిన ప్రభుత్వం టికెట్ల రేట్లపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఈ సినిమాకు మైనస్ గా మారే అవకాశం కన్పిస్తోంది.

    Also Read: వాళ్ళల్లో మరో వాణిశ్రీ, బ్రహ్మానందం.. గొప్ప నటులయ్యేది చిన్న పాత్రలతోనే !