చురుగ్గా ముందుకు కదులుతున్న రుతుపవనాలు!

మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలను తాకనున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించాయి. చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరు, కన్యాకుమారి, దక్షిణ కర్ణాటక, బెంగళూరు వరకు మేఘాలు పరుచుకుని వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణాలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5న ఏరువాక పౌర్ణమి. రైతుల విత్తనాలు […]

Written By: Neelambaram, Updated On : June 4, 2020 8:53 pm
Follow us on

మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలను తాకనున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించాయి. చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరు, కన్యాకుమారి, దక్షిణ కర్ణాటక, బెంగళూరు వరకు మేఘాలు పరుచుకుని వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణాలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5న ఏరువాక పౌర్ణమి. రైతుల విత్తనాలు నాటేందుకు నాగలి పడతారు. ఈ క్రమంలో మరో మూడు రోజుల్లో నైరుతి ఆగమనం అంటూ వాతావరణ శాఖ రైతుల్లో ఆనందం నింపింది. మరోవైపు నిసర్గ తుఫాను మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరం దాటి అల్పపీడనంగాగా మారింది. ఉత్తర విదర్భ, దక్షిణ మధ్య ప్రదేశ్ ప్రాంతంలో బలహీనపడింది. దాని ప్రభావం వల్ల విదర్భ, ఛత్తీస్ గఢ్, దక్షిణ, తూర్పు తెలంగాణాల్లో ఆకాశం మేఘావృతమైంది. అక్కడడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.