YS Sharmila Son Raja: ఏదైనా దాస్తేనే అందం. నలుగురిలో పంచితే ఏముంటుంది. ప్రతి వారికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. సామాన్యుడి గురించి ఎవరు పట్టించుకోకున్నా సెలబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉండటం కామనే. అందులో సినిమా, రాజకీయ నేతల గురించి అయితే తెలుసుకోవాలనే ఆసక్తి మెండు. ఈ నేపథ్యంలో ఆడవారి గురించి అయితే ఇంకా ఎక్కువగా తెలుసుకుంటారు. వారి జీవితంలో ఉండే అనుభవాల గురించి ఎంతో ఉత్సుకత చూపిస్తుంటారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడ కూడా పెదవి విప్పిన దాఖలాలు లేవు. అసలు ఆమెకు ఎంత మంది సంతానం అనే విషయం కూడా ఎప్పుడు పంచుకోలేదు.

తాజాగా తన కుమారుడు రాజా ఫొటో మాత్రం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద కొడుకు ఉన్నాడనే విషయం కూడా వారికి తెలియదు. దీంతో వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తన పేరు ‘రాజా’ అని తాత పేరు కలిసేలా అలా పెట్టుకున్నారనే విషయం కూడా ఎప్పుడు వెల్లడించలేదు. దీంతో ఆమె తన పుత్రుడి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ఫొటో పోస్టు చేసింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న షర్మిల ఇప్పుడు తన వారసుడి ఫొటో ఎందుకు అభిమానులతో పంచుకుంది. అతడిని కూడా రాజకీయ రంగప్రవేశం చేయిస్తుందా? లేక అతిడికి ఇష్టమైన కెరీర్ ను ఎంచుకునేలా చేస్తుందా చూడాలి.
షర్మిల కొడుకు ‘రాజా’ అచ్చం తాత రాజారెడ్డిలా ఉంటాడట.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా మృదుస్వభావి. రాజకీయాల్లో నేర్పరిగా పద్ధతిగా ఉంటారు. ఫ్యాక్షన్ పోకడలను పట్టించుకోరు. కానీ వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి మాత్రం ఫ్యాక్షన్ లీడర్ అన్న పేరుంది. ఆయనకు రక్తచరిత్ర ఉంది. ఫ్యాక్షన్ గొడవల్లోనే రాజారెడ్డి హత్య జరిగింది. కడపలో ఫ్యాక్షన్ లీడర్ గా ఎన్నో హత్యలు, దందాలు చేశాడని.. ఆయనకు ఆవేశం చాలా ఎక్కువ అని.. జగన్ కు అవే వచ్చాయనే ప్రచారం ఉంది. అయితే జగన్ కు ఇద్దరు ఆడపిల్లలే. మగపిల్లలు లేరు. కానీ షర్మిలకు మగపిల్లలు ఉన్నారు. అందులో ‘రాజా’ ఒకరు. అచ్చం తాతా రాజారెడ్డిలోని రాజసం ఇతడిలో వచ్చిందని.. జగన్ తర్వాత ‘రాజా’నే వైసీపీ లీడర్ అన్న చర్చ సాగుతోంది.

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను విమర్శిస్తూ తన పాదయాత్రను వైఎస్ షర్మిల కొనసాగిస్తోంది. అయినా సరైన గుర్తింపు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కొడుకును కూడా వెంటబెట్టుకుని రాజకీయ పోరాటం చేస్తుందా? అనేది అందరి మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్న. ఇక్కడ తన ప్రాతినిధ్యం దక్కాలంటే ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. షర్మిల వెంట త్వరలోనే ఆమె కొడుకు కూడా రాజకీయాల్లోకి వస్తాడా? అందుకే ఇప్పుడు హఠాత్తుగా అతడి ఫొటోను షేర్ చేసిందా? అన్న అనుమానాలు రాక మానడం లేదు.
తెలంగాణలో ఇప్పటి వరకు షర్మిల పార్టీకి సరైన గుర్తింపు దక్కలేదు. కనీసం ఓ పార్టీగా కూడా గుర్తించడం లేదు. కేఏ పాల్ పార్టీలా చేస్తున్నారు. పార్టీకి పవర్ దక్కాలంటే పార్టీల్లో మంచి అభిప్రాయం రావాలంటే కొన్ని ట్రిక్కులు ప్లే చేయక తప్పదు. అందుకే తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకొచ్చి అతడి ద్వారా తన కలలను నెరవేర్చుకోవాలని చూస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. . ఏదిఏమైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తమ పలుకుబడి పెరగడం ఏం చేయడానికైనా సిద్ధమే అన్నట్లు పలు సంఘటనలు రుజువు చేశాయి. ఈ కోణంలోనే షర్మిల కూడా ఆలోచించి పార్టీకి జవసత్వాలు నింపేందుకు తన కొడుకును కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి తేబోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.