పవన్ జోలికొస్తే ఖబర్ధార్ నారాయణ: సోమువీర్రాజు

కమ్యూనిస్టులను వీడి బీజేపీతో కలిసిన పవన్ కళ్యాణ్ ను ఇటీవల సీపీఐ నారాయణ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ పవన్ చేసిన మోసంపై దారుణ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘గత ఎన్నికల్లో బుద్ది తక్కువై పవన్ ని తాము నమ్మామని సీపీఐ నారాయణ ఆడిపోసుకున్నారు. పవన్ ఇలా బీజేపీకి సపోర్టు చేస్తారని ఊహించలేదని నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ నారాయణ మండిపడ్డారు. […]

Written By: NARESH, Updated On : October 2, 2020 11:18 am
Follow us on

కమ్యూనిస్టులను వీడి బీజేపీతో కలిసిన పవన్ కళ్యాణ్ ను ఇటీవల సీపీఐ నారాయణ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ పవన్ చేసిన మోసంపై దారుణ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘గత ఎన్నికల్లో బుద్ది తక్కువై పవన్ ని తాము నమ్మామని సీపీఐ నారాయణ ఆడిపోసుకున్నారు. పవన్ ఇలా బీజేపీకి సపోర్టు చేస్తారని ఊహించలేదని నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ నారాయణ మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీలు మద్దతు పలకడం దారుణమన్నారు.పవన్ కళ్యాణ్ మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొని మాసికం చేసుకున్నారని’ సెటైర్లు వేశారు.

పవన్ కళ్యాణ్ పై ఇటీవల వ్యక్తిగత విమర్శలతో తిట్టిపోశారు సీపీఐ నారాయణ.. పవన్ మూడు  పెళ్లిళ్లు చేసుకున్నాడని..  ఆయన పెళ్లిళ్ల మాసికం అంటూ తిట్టిపోశాడు. దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. కానీ ఆయన మిత్రపక్షం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం పవన్ పై విమర్శలను తట్టుకోలేకపోయాడు. అందుకే సీపీఐ నారాయణను కడిగిపారేశారు.

Also Read: హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..?

పవన్ కళ్యాణ్ పై విమర్శలకు జనసేన మిత్రపక్షం బీజేపీ కౌంటర్ ఇచ్చింది.  సీపీఐ నారాయణకు తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు పవన్ పై నోరుపారేసుకున్న సీపీఐ నారాయణకు హెచ్చరికలు పంపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు నారాయణకు లేదని.. గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు మీ జ్ఞాపకశక్తిని కోల్పోయారా అని వీర్రాజు ప్రశ్నించారు. అసలు కమ్యూనిస్టులకు దేశంలో ఉనికే లేదని.. అలాంటి పార్టీతో ఎవరు కలవరని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ అండగా నిలుస్తుందని.. పూర్తి మద్దతునిస్తుందని స్పష్టం చేశారు.

Also Read: ‘అమరావతి’ ఆందోళన.. రాష్ట్రమంతా సాధ్యమేనా?

ఇక బాబ్రీ మసీదు కేసులో అద్వానీని నిర్ధోషిగా విడుదల చేయడంపైన కూడా నారాయణ విమర్శలు చేశారు. దీన్ని కూడా సోము వీర్రాజు ఖండించారు. ఇలా అవాకులు చెవాకులు పేల్చవద్దని హితవు పలికారు. కోర్టు తీర్పులను కూడా గౌరవించని కమ్యూనిస్టులు రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు.