భారతదేశంలోని వీవీఐపీలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రత్యేకంగా తయారు చేయించిన ఎయిర్ ఇండియా వన్ విమానం నిన్న ఢిల్లీకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుల విమానానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న బోయింగ్–777 విమానం అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థను కలిగి ఉంది. ప్రధాని మోదీ కోసం ఈ విమానాన్ని కేంద్రం ప్రత్యేకంగా తయారు చేయించింది. భారత వాయుసేన పైలెట్లు నడిపే ఈ విమానాన్నీ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిల అంతర్జాతీయ ప్రయాణాల కోసం తయారు చేయించారు.
ఈ విమానంలో క్షిపణుల దాడులను తట్టుకోగలిగే టెక్నాలజీని పొందుపరిచారు. కేంద్రం ఆర్డర్ చేసిన ఈ విమానాలు ఈ సంవత్సరం జులైలోనే భారత్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల ఆలస్యంగా విమానం భారత్ కు చేరుకుంది. కేంద్రం రెండు విమానాలను ఆర్డర్ చేయగా మరో రెండు మూడు రోజుల్లో విమానం మన దేశానికి రానుంది. గడిచిన పాతికేళ్లుగా ప్రధాని బోయింగ్ 747 విమానాన్ని వినియోగిస్తుండగా ఇప్పుడు దాని స్థానంలో బోయింగ్ 900 విమానాన్ని వినియోగించనున్నారు.
ఈ విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే ఇందులో లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రేర్డ్ కౌంటర్‌మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ ఉన్నాయి. ఎలాంటి దాడులనైనా తట్టుకోగలిగే అధునాతన సాంకేతికతో కూడిన ఈ విమానానికి శత్రువుల రాడార్ ఫ్రీక్వెనీని సైతం జామ్ చేయగల సామర్థ్యం ఉంది. ఈ విమానం ద్వారా ఇతరులతో వీడియో, అడియో కమ్యూనికేషన్ చేయవచ్చు. గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ఈ విమానం ద్వారా ప్రయాణం చేయవచ్చు.
ఈ విమానంలో సమావేశాలను నిర్వహించుకునే సదుపాయంతో పాటు ప్రధాని కోసం కార్యాలయం ఉంది. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ రెండు విమానాల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను చూస్తుంది. కేంద్రం ఈ రెండు విమానాల తయారీ కోసం 8400 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
#WATCH: VVIP aircraft Air India One that will be used for President, Vice President & PM arrives at Delhi International Airport from US.
It is equipped with advance communication system which allows availing audio & video communication function at mid-air without being hacked. pic.twitter.com/4MtXHi8F9O
— ANI (@ANI) October 1, 2020